కామెడీ స్క్వేర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హిమబిందు వెలగపూడి నిర్మాణంలో బాలు దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాలు మాట్లాడుతూ ‘మహానగరంలో నివసిస్తూ స్వతంత్య్ర భావాలున్న నలుగురు అమ్మాయిలకు సంబంధించిన కథే ఈ చిత్రం. త్రిదాచౌదరి, ధన్య బాలకృష్ణన్, సిద్ధిఇద్నాని, కొమలిప్రసాద్ నలుగురు అమ్మాయిలుగా నటిస్తున్నారు. కామెడీ ప్రధానంగాసాగే ఈ సినిమాలో కథానుగుణంగా ఉండే ట్విస్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’ అన్నారు. నిర్మాత హిమబిందు వెలగపూడి మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో నేటి నుండి తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఫిబ్రవరిలో గోవాలో సెకండ్ షెడ్యూల్‌ను చిత్రీరిస్తాం. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసి మేనెలలో సినిమాను విడుదలచేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. త్రిదాచౌదరి, ధన్య బాలకృష్ణ, సిద్ధి ఇద్నాని, కొమలిప్రసాద్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.