కిలాడీ కాంచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లారెన్స్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. స్టార్ హీరో అక్షయ్‌ని డైరెక్ట్ చేయబోతున్నాడు. హారర్ కామెడీల స్పెషలిస్టు అనిపించుకున్న లారెన్స్, కాంచన ఫార్ములాని బాలీవుడ్‌కి ఎగుమతి చేస్తున్నాడట. బాలీవుడ్ కిలాడీ అక్షయ్‌కుమార్ హీరోగా ‘కాంచన’, ‘ముని’ చిత్రాల రీమేక్‌కు లారెన్స్ సన్నాహాలు చేస్తున్నాడని టాక్. ఇద్దరి మధ్యా ఇప్పటికే చర్చలు సాగాయని, రెండు చిత్రాల రీమేక్‌లా కాకుండా కాంచన, ముని చిత్రాల్ని కలిపి ఓ హారర్ కామెడీ చేసే అవకాశం ఉందని మేకర్స్ చెబుతున్నారు. అంటే అక్షయ్‌కుమార్ దెయ్యం పాత్రలో భయపెట్టబోతున్నాడన్నది కన్ఫర్మ్ అయ్యింది. కాంచన కథలో హిజ్రా (శరత్‌కుమార్) ఆత్మ లారెన్స్‌లో ప్రవేశిస్తుంది. తర్వాత ఏం జరిగింది? అన్నది ఉత్కంఠగా సాగే కథనం. లారెన్స్ పనితనానికి క్రిటిక్స్‌నుంచి ప్రశంసలు దక్కాయి. అందుకే అక్షయ్ సైతం ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. 2020లో సినిమా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆరు నెలలపాటు స్క్రిప్ట్ వర్క్ చేసి, వచ్చే జూన్ జూలైలో షూటింగ్ ప్రారంభిస్తారని అంటున్నారు. ఏడాది చివరినాటికి సినిమా పూర్తి చేయాలన్నది ప్రణాళిక.