బంపర్ ఆఫర్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి, మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న ముద్దుగుమ్మ షాలిని తెలుగులో మాత్రం మంచి ఆఫర్లను దక్కించుకోలేక పోతుంది. చిన్న పాత్రలు సెకండ్ హీరోయిన్ పాత్రలే ఈమెకు దక్కుతున్నాయి. తమిళంలో ‘100% లవ్’ చిత్ర రీమేక్ ‘100% కాదల్’ చిత్రంలో నటిస్తోంది. షాలినికి దక్కిన పెద్ద ఆఫర్ ఇప్పటివరకు అదే. మంచి ఆఫర్స్‌కోసం ఎదురుచూస్తున్న ముద్దుగుమ్మ షాలిని పాండేకు బాలీవుడ్‌లో మంచి ఆఫర్ దక్కింది. ప్రస్తుతం కళ్యాణ్‌రామ్ నటిస్తున్న ‘118’ చిత్రంలో షాలిని పాండే ఒక హీరోయిన్‌గా నటిస్తుంది. చిన్నా పెద్ద అనే తేడాలేకుండా మూడునాలుగు సినిమాలు చేస్తున్న షాలిని పాండే తాజాగా బాలీవుడ్‌లో పరేష్‌రావల్ కుమారుడు ఆదిత్య హీరోగా పరిచయం కాబోతున్న ‘బాంఫాడ్’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో షాలిని పాండే బాలీవుడ్‌లో మంచి విజయంతో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలవారు అంటున్నారు.