మొరాకోలో శాతకర్ణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా లొకేషన్ల కోసం దర్శకుడు క్రిష్ యూరోప్, ఆఫ్రికాలోని కొన్ని దేశాలను సందర్శించారు. కథలో ప్రధాన భాగమైన యుద్ధ సన్నివేశాల కోసం ఉత్తరాఫ్రికాలోని మొరాకో దేశాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గరుకుగా ఎతె్తైన పర్వతాలతో సుదీర్ఘంగా ఎడారి వున్న ప్రదేశాలతో వున్న మొరాకోలో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తే బాగుంటుందని ఈ దేశాన్ని ఎంపిక చేశారట. శక చక్రవర్తి అయిన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ ఆధారంగా చారిత్రక నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాకు బడ్జెట్ దాదాపు 50 కోట్లు. ఉగాది రోజున లాంఛనంగా సినిమాను ప్రారంభించి 22 నుండి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. నయనతార కథానాయికగా, రాజమాత గౌతమిగా హేమమాలినిని ఇప్పటికే ఎంపిక చేయడం విశేషం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.