కుట్రపూరిత ప్రేమకథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదవులు పోయినా, ప్రాణాలు పోయినా, అయినవారు వద్దూవద్దన్నా లక్ష్మీపార్వతి చేయివదలని ఎన్టీఆర్ ప్రేమ అనే కథను వాలంటైన్స్‌డే సందర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైలర్‌ను విసరబోతున్నాడు ఆర్జీవి. ‘ఇది కుటుంబ కుట్రల చిత్రం’ అనే ట్యాగ్‌లైన్‌తో రాంగోపాల్‌వర్మ తన ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వటమే కాదు, చాలామందిలో చెమటలు పుట్టిస్తోంది. ఈ కథను ముందెన్నడూ వర్మ చూడని విధానం, తీయని విధానంలో ప్రత్యేకంగా ఉంటుందని తెలియనివాళ్లు కూడా చెప్తున్నారు. తెలుగు ప్రజలకు ఆరాధ్యదైవంగా, తెలుగుఖ్యాతిని నలుదిశలా చేరవేసిన ఎన్టీఆర్ లోలోపలలోని ఒక నిర్వీర్యమైన ప్రేమకథను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఆవిష్కరించబోతున్నాడు రాంగోపాల్‌వర్మ. తుదిశ్వాస వదిలే వరకూ లక్ష్మీ పార్వతి తన గౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్ జీవితంపై ఆమె ఎలాంటి ప్రభావం చూపించలేదు..? లక్ష్మీకోసం తను అన్నీ పణంగాపెట్టి పోరాడిన ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల మధ్య అతి రహస్య సంబంధం ఏంటి? విడదీయరాని ఆ అపవిత్ర బంధం ఏంటి..? ఇలాంటి అంశాలు కొందరికి రుచించకపోయినా, అవి తెలుగు ప్రజల గొంతుల్లోకి దిగాల్సిన అవసరముంది కనుకనే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆయన కుటుంబ సభ్యులకు, నమ్మకంగా లేని అనుచరులకు, వెన్నుపోటు పొడిచిన కుట్రదారులకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ముందుపోటులా ఉంటుంది. రాంగోపాల్‌వర్మ చెప్పబోయే ఈ కథ, ఎన్టీఆర్ మంచి విషయాలే కాదు, తన సొంత ఫ్యామిలీవాళ్లు చేసిన చెప్పుకోలేని పనులను కూడా అడ్డుకోలేని ఎన్టీఆర్ అమాయకత్వాన్ని చూపెట్టబోతోంది. అందుకే ఈ కథ నిజాలనే కత్తులతో మూకుమ్మడి దాడిచేయబోతోంది. తెలిసిన కథలో తెలియని కథనాన్ని వెలికితీయబోతుంది. త్వరలో విడుదలకు సిద్ధంఅవుతున్న ఎన్టీఆర్ అసలుకథ తెలుగు తెరపై లక్ష్మీ ఆటంబాంబులను పేల్చడానికి సిద్ధం అవుతోంది. వెలుగులుపంచిన వ్యక్తిచుట్టూ అలుముకున్న చీకట్లను తెరమీదకు తీసుకొస్తున్నాడు వర్మ. ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలిపే ట్రైలర్‌ను ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు చాలామంది వీపులలో గుచ్చబోతున్నాడు రామ్‌గోపాల్‌వర్మ.