22న క్రేజీ క్రేజీ ఫీలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’. సంజయ్ కార్తీక్ దర్శకుడు. విష్వంత్, పల్లక్ లల్వాని హీరో హీరోయన్లు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించింది.
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన చిత్రం ఈనెల 22న విడుదల చేస్తున్నారు. దర్శకుడు సంజయ్ మాట్లాడుతూ కేరింత, మనమంతా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్వంత్ హీరోగా, పల్లక్ లల్వాని హీరోయిన్‌గా ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమికుల మధ్య వుండే ఫీలింగ్స్‌ని వినోదాత్మకంగా చూపిస్తున్నాం. వెనె్నల కిశోర్ లెంగ్తీ క్యారెక్టర్‌లో కడుపుబ్బ నవ్విస్తాడు. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా క్వాలిటీ సినిమా నిర్మించారు. అన్నివర్గాల ప్రేక్షకుల్ని, ముఖ్యంగా యూత్‌ని అట్రాక్ట్‌చేసే అంశాలతో చిత్రాన్ని రూపొందించాం. నిర్మాత మధు మాట్లాడుతూ ప్రేమ, ఫీల్, వినోదం మూడు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ దర్శకుడు సంజయ్ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా క్రేజీ క్రేజీ ఫీలింగ్‌ని రూపొందిస్తున్నారు. భీమ్స్ మంచి పాటలందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 22న విడుదల చేయనున్నాము అన్నారు.