నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాపినీడు స్వయంగా రచయిత. పత్రికాసంపాదకుడు. విజ్ఞత కలిగిన వ్యక్తి. 1970 దశకంలో బొమ్మరిల్లు మాసపత్రిక, నీలిమ పేరిట యువ మాసపత్రిక సమర్థవంతంగా నడిపారు. పత్రికల్లో కొత్త ప్రయోగాలు చేశారు. అనుబంధ నవలలు, సినిమా అనుబంధాలు ప్రత్యేకమైన పుస్తకాలుగా ప్రధాన సంచికతో ఇస్తూండేవారు. సినీ పాఠకులకు ఆకర్షణ కలిగించేలా ఒక్కో నెల ఒక్కో తారపై కథనాలు ఇవ్వడంతోపాటు ‘జయసుధ జాకెట్టు’ అంటూ కాటన్ పేపర్ బ్లౌజు సైతం మాసపత్రికతో ఇవ్వడం విచిత్రం అనిపించేది.
చలన చిత్రరంగంలో బాపినీడు చాలా ప్రయోగాలు చేశారు. బాల సాహిత్యానికే పరిమితమైన ఉత్పల సత్యనారాయణాచార్య వంటి ఎందరో గేయ రచయితలను ప్రోత్సహించారు. కొంపల్లి గౌరీశంకర్ వారి సినీ పత్రికకు ఆస్థాన పండితుడు. ఆయన విమర్శలు వాడిగా వేడిగా ఉండేవి. చిరంజీవి వంటి అగ్రశ్రేణి నటులతో బాపినీడు కొన్ని చిత్రాలు నిర్మించారు. బొమ్మరిల్లు పేరిట వారు నిర్మించిన ఫ్యామిలీ చిత్రం ఆ రోజుల్లో సూపర్ హిట్. వాలు జడ -తోలు బెల్టు అనే ప్రయోగాత్మక చిత్రం సూపర్ ప్లాప్. అయినా బాపినీడు విజయాలకు పొంగిపోలేదు. ప్లాప్‌లకు కుంగిపోలేదు.
బాపినీడుతో వ్యక్తిగత అనుబంధం ధ్రుడమైనది. నాకు పేరు తెచ్చిపెట్టిన చారిత్రక నవల శాతవాహనుల కాలానికి చెందిన శ్రీలేఖ. దాదాపు 36 నెలలు ధారావాహికంగా ప్రచురించారు. అలాగే అంబుధిలో అంగారం, అగ్ని గీతం, నన్నయ్య భట్టు మళ్లీ పుట్టాడు, అమృత వాహిని వంటి నా రచనలను ధారావాహికాలుగా, అనుబంధ నవలలుగా ప్రచురించారు.
మద్రాసులోని ధనలక్ష్మి కాలనీలో వీరి ఆఫీసు. అక్కడ ముద్రణ పబ్లిసిటీ నిర్వహిస్తూ ఉండేవారు. బసవేశ్వరుని జీవితం ఆధారంగా రచించిన అనుభవ మంటపం నవలను బాపినీడు మూడు నెలలు వరుసగా ప్రచురించారు. దానికి ఆనాటి ఉపరాష్టప్రతి బిడి జెట్టి , కేంద్ర మంత్రి బెజవాడ గోపాల రెడ్టి వంటి వారినుంచి ఆశీర్వదాలు అందాయ. కాకతీయ సామ్రాజ్యానికి చెందిన రుద్రమ దేవి కాలం నాటి చారిత్రికాంశం ఆధారంగా రచించిన ‘ఆవాహన’ నవలను రెండు నెలలు ప్రచురించారు. లక్షలాది అభిమానులను శ్రేయోభిలాషులను వదిలి బాపినీడు పరిణిత వయస్సులో కన్నుమూశారు. తెలుగు సాహిత్యానికి, చలన చిత్ర రంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. వారికి ఇదే ప్రగాఢ శ్రద్ధాంజలి.

-ముదిగొండ శివ ప్రసాద్