27న మొదలెడతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా పేరు సూర్య.. తరువాత ఏడాది గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చి 27న ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ డేట్‌ను చిత్ర నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ఇక బన్నీకి త్రివిక్రమ్‌తో ఇది మూడో సినిమా. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి’ మంచి విజయాలు సాధించాయి. మరి ఈ చిత్రం వీరికి హ్యాట్రిక్‌ను ఇస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్, సుకుమార్‌తో సినిమా చేయనున్నారు. ఆర్య సిరీస్ తరువాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ మూడోసారి నటించనున్నాడు. ఆగస్టు నుండి ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది.