టెన్షన్ పెట్టనున్న జెస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్‌సింగ్, అర్చనాశాస్ర్తీ, ఆషిమా నర్వాల్ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ ‘జెస్సీ’. ఏకా ఆర్ట్ ప్రొడక్షన్ ప్రై.లి. బ్యానర్‌పై వి.అశ్వినికుమార్ దర్శకత్వంలో శే్వతా సింగ్ నిర్మించిన చిత్రం మార్చి 15న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత శే్వతాసింగ్ మాట్లాడుతూ ‘సినిమా పివిఆర్ సినిమాస్ ద్వారా 15న విడుదలవుతుంది. వంశీ కాకా చాలా సపోర్ట్ చేశారు’ అన్నారు. ఆషిమా నర్వాల్ మాట్లాడుతూ ‘సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం. మెయిన్ లీడ్‌గా మంచి క్యారెక్టర్ చేశాను. 15న విడుదలవుతున్న ఈ సినిమాను చూసి అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు. దర్శకుడు అశ్వినికుమార్ మాట్లాడుతూ ‘రెండేళ్లు సినిమా కోసం కష్టపడ్డాం. ఆదరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ ‘సాధారణంగా వెనుకనుండి వచ్చి ఎవరైనా ఉన్నట్టుండి చెయ్యేస్తే భయపడతాం. కానీ ఎవరూలేకుండా అలా యాక్ట్‌చేయడం చాలా కష్టం. అలాంటి ఫీలింగ్ ఉన్న సన్నివేశాలను మంచి సౌండింగ్‌తో డిజైన్ చేశాం. డైరెక్టర్ అశ్వినికుమార్ సినిమా బాగా డైరెక్ట్ చేశారని, సంగీతం అందించడాన్ని ఎంజాయ్ చేశాను’ అన్నారు.
విమల్‌కృష్ణ మాట్లాడుతూ.. ‘సినిమాపై మా కాన్ఫిడెన్స్ ఏమాత్రం మారలేదు. మంచి సినిమా చేశాం. హారర్‌కంటే ఇద్దరు సిస్టర్స్ మధ్య మంచి సెంటిమెంట్ మెప్పిస్తుంది. శ్రీచరణ్ తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు’ అన్నారు. అభినవ్ గోమటం మాట్లాడుతూ.. ‘ఇదొక సైకాలాజికల్ హారర్ థ్రిల్లర్. డిఫరెంట్ రోల్‌ప్లేచేశాను. హారర్ కామెడీకాదు కాబట్టి.. కామెడీ పెద్దగా ఉండదు. నిర్మాతగా శే్వతా ఎలాంటి సినిమాలను భవిష్యత్తుతో చేస్తారనడానికి ఇదొక ఉదాహరణ. ఒక కొత్త ప్రయత్నం. అందరికీ నచ్చుతుంది’’అన్నారు.