కొత్త స్క్రీన్‌ప్లేతో వేటాడే పులి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ బుజ్జిమేక ఫిలింస్ పతాకంపై కోటి కిరణ్, ఆశ జంటగా పాండాల మహేష్‌కుమార్ గౌడ్ దర్శకత్వంలో పాండాల బుజ్జి రూపొందిస్తున్న చిత్రం ‘వేటాడే పులి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా రూపొందించామని తెలిపారు. కుటుంబంతో కలిసి రెండు గంటలపాటు సినిమాను ఎంజాయ్ చేయవచ్చని, కొత్తగా వున్న ప్రేమకథతో కొత్త స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించామని అన్నారు. కథాపరంగా వచ్చే పాటలు ప్రేక్షకులకు నచ్చుతాయని నిర్మాత తెలిపారు. చిట్టిబాబు, అప్పారావు, శివ, మురళీకృష్ణ, నూకరాజు, పవన్, రాజవౌళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:చందు, సంగీతం:రాజ్‌కిరణ్, నిర్మాత:పాండాల బుజ్జి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం:పాండాల మహేష్‌కుమార్ గౌడ్.