అందమైన భయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధడక్ సినిమాతో స్టార్ ఇమేజ్ అందుకున్న శ్రీదేవి కూతురు జాన్వీ మొత్తానికి బాలీవుడ్‌లోనే సెటిల్ అయింది. ఇప్పటికే వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు త్వరలోనే వెండితరపై భయపెట్టేందుకు రెడీ అయింది. బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్‌రావ్ ‘రూహ్ ఆఫ్‌జా’ అంట మరో హారర్ కామెడీ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమైంది. అందుకే హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. ధడక్‌లో జాన్వీ నటన చిత్ర బృందానికి బాగా నచ్చింది. ఈ పాత్రకు ఆమె అయితే చక్కగా సరిపోతుందని భావిస్తున్నారు. రాజ్‌కుమార్, జాన్వీ తొలిసారి కలిసి నటించడం కూడా ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతుంది. దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. కొత్త పెళ్లికొడుకులను తన పాటలతో నిద్రపుచ్చి పెళ్లికూతుళ్లను ఆవహించే దెయ్యం కథ ఇది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నేపథ్యంగా కథ సాగుతుందట.