సంచలనం ఈ మాగ్నెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ సాక్షి చౌదరి ప్రధాన పాత్రలో ఎం ఆదిశేషసాయి రెడ్డి దర్శకత్వంలో లార్డ్‌శివ క్రియేషన్స్ పతాకంపై ఎం శివారెడ్డి నిర్మించిన రొమాంటిక్ థ్రిల్లర్ మాగ్నెట్. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర ట్రైలర్‌ని ప్రసాద్ లాబ్‌లో విడుదల చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సి కల్యాణ్ టీజర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాక్షి చౌదరి నటన చిత్రానికే హైలెట్‌గా నిలుస్తుంది. తప్పకుండా సినిమా మంచి విజయం సాధించాలన్నారు. దర్శకుడు మాట్లాడుతూ చిత్రంలో అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉంటాయి. ముఖ్యంగా సాక్షి చౌదరి నటన ఓ రేంజ్‌లో ఉంటుంది. కుర్రకారు కోరుకునే అంశాలతోపాటు అటు ఫ్యామిలీ ప్రేక్షకులు చూసేలా ఉంటుందన్నారు. నిర్మాత మాట్లాడుతూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, 15న చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు. సాక్షి చౌదరి మాట్లాడుతూ- ట్రైలర్‌లో చూసినట్టు ఇది కేవలం రొమాంటిక్ సినిమా మాత్రమే కాదు. మంచి కథ, ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుందని హామీ ఇచ్చారు.