ముందుకొచ్చిన మోదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో వివేక్ ఒబెరాయ్ ముఖ్యపాత్ర పోషిస్తున్న చిత్రం పీఎం నరేంద్ర మోదీ. వివేక్‌తోపాటు సందీప్‌సింగ్, ఆనంద్‌పండిట్, ఆచార్య మనీశ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాను ఏప్రిల్ 12న విడుదల చేయాలనుకున్నా, కొన్ని కారణాలవల్ల ఏప్రిల్ 5నే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మోదీ జీవితంలోని ఎత్తుపల్లాలు, వాటిని అధిగమిస్తూ దృఢసంకల్పంతో ఆయన కొనసాగించిన జీవిత ప్రయాణం ఇతివృత్తంగా సినిమాను నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే, మోదీ పాత్రలో నటిస్తున్న వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో కనిపించనున్న తొమ్మిది గెటప్పులతో చిత్రబృందం తాజాగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌ను సినీ విశే్లషకుడు తరుణ్ ఆదర్శ్ మంగళవారం ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. మరో విశేషమేమంటే తెలుగు, తమిళం, హిందీ కలిపి 23 భాషల్లో ‘పీఎం నరేంద్రమోదీ’ని విడుదల చేయనున్నారు. భాజపా అధ్యక్షుడు అమిత్ షా పాత్రను మనోజ్ జోషి పోషిస్తున్నాడు.