అటా.. ఇటా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ శ్రుతిహాసన్‌కు దక్షిణాదిలో మంచి పాపులారిటీ వుంది. ముఖ్యంగా తెలుగులో ఈమెకు శ్రీమంతుడు, ఎవడు, రేసుగుర్రం సినిమాల విజయాలతో జోరుమీదున్నా కూడా ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ చిత్రాల్లో మాత్రం నటించడంలేదు. మరోవైపు తమిళంలో కూడా అంతంతమాత్రంగానే సినిమాలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో చేస్తున్న ఒకే ఒక చిత్రం ‘ప్రేమమ్’. ఇందులో కూడా తన పాత్ర కొద్దిసేపే ఉంటుంది. దాంతోపాటు తమిళంలో కూడా సింగం-3 మాత్రమే చేస్తోంది. ఇంత క్రేజీ వున్న శ్రుతిహాసన్ ఎందుకు సినిమాలపై ఆసక్తి చూపించడం లేదనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. బాలీవుడ్‌పై దృష్టి పెట్టి ఇక్కడి అవకాశాలను కాదనుకున్న ఈమెకు బాలీవుడ్‌లో కూడా వరుసగా నిరాశలే ఎదురవుతున్నాయి. మరి తన నిర్ణయం మార్చుకుంటే తప్ప సౌత్‌లో హీరోయిన్‌గా నిలబడే అవకాశాలు మృగ్యమే. ఇప్పటికే స్టార్ హీరోలందరూ శ్రుతిహాసన్‌తో నటించేందుకు రెడీగా వున్నారు. కానీ ఈమె మాత్రం సినిమాల్లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వారందరూ వేరే హీరోయిన్ల కోసం సన్నాహాలు చేస్తున్నారు. మరి ఇకనైనా తన విధానాన్ని మార్చుకుని తెలుగు తమిళ భాషల్లో వస్తున్న అవకాశాల్ని అందిపుచ్చుకుంటే తప్ప శ్రుతిహాసన్‌కు ఇక్కడ అవకాశాలు రావడం గగనమే.