ఎందుకంటే అందుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందగత్తెలందరిదీ ఒక బూత్.. ఆమెది మరో బూత్ -అన్నట్టుంది ఆలియా మాటలు వింటుంటే. ఔనుమరి -సార్వత్రిక ఎన్నికల్లో సెలబ్రిటీలంతా బిజీగావుంటే, ఆలియా మాత్రం తనకు ఓటు హడావుడే లేదంటోంది. ఆ మాటకొస్తే -అసలు ఓటే వేయనంటోంది ఆలియా. ఎందుకంటే -ఆమెకు ఇండియాలో ఓటు లేదు కనుక. ఆలియా పుట్టింది ముంబయిలోనే అయినా ఆమెకు భారత పౌరసత్వం లేదు. కారణం -తల్లి సోనీ రజ్దాన్ ఇంగ్లాండ్ వాసి. సో, ఆలియాకు బ్రిటీష్ పౌరసత్వం వచ్చింది. భారత నిబంధనల ప్రకారం ద్వంద్వ పౌరసత్వం చెల్లదు కనుక ఆలియా బ్రిటీష్ పౌరసత్వానికే పరిమితమైంది. ఓటింగ్ శాతం పెంచాలంటూ అటు ఈసీ, ఇటు రాజకీయ నేతలు పిలుపునిస్తూ అందుకు సెలబ్రిటీలంతా సాధారణ ఓటర్లను కదిలించాలని చెబుతుంటే -ఆలియా మాత్రం ఇవేమీ తనకు సంబంధం లేదంటూ హ్యాపీగా చెబుతోంది. ‘కళంక్’ చిత్ర ప్రచారంలో భాగంగా వరుణ్, సోనాక్షి సిన్హా, ఆదిత్యరాయ్ కఫూర్‌లను ‘సరైన నేతను ఎలా ఎన్నుకోవాలి’ అని ప్రశ్నించినపుడు ‘ఓటు ద్వారా’ అని ఠక్కున చెప్పారు. కానీ ఆలియా మాత్రం ‘నేను ఓటేయడానికి వెళ్లను. ఎందుకంటే ఇక్కడ ఓటు లేదుగా’ అంటూ సమాధానమిచ్చింది. ఆలియా భట్ త్వరలోనే రాజవౌళి ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు షూట్‌లోకి జాయిన్ కానుంది.