అజ్ఞాత.. ‘విశ్వామిత్ర’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరూ తనవాళ్లే అనుకునే ఓ మధ్యతరగతి అమ్మాయి నందితారాజ్. జీవితంలో ఆమెకు ఎదురైన సమస్యలను ఓ అజ్ఞాతవ్యక్తి పరిష్కరించాడు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరనేది సినిమా చూస్తే అర్థమవుతుంది అంటున్నాడు రాజ్‌కిరణ్. సృష్టికి, మనిషి ఊహకు ముడిపెడుతూ ఆయన తెరకెక్కించిన చిత్రం ‘విశ్వామిత్ర’. ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్, రాజకిరణ్ నిర్మిస్తున్న చిత్రమిది. నందితారాజ్, సత్యం రాజేష్ జంటగా నటించారు. మేలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ ‘మానవ మేధకు అందని విషయాలు విశ్వంలో ఎన్నో. సృష్టిలో ఏది జరుగుతుందో, ఏది జరగదో చెప్పడానికి మనుషులెవరు? ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. ఎప్పటికీ నిలిచే సృష్టిలో మనుషులు కొంతకాలమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే మా విశ్వామిత్ర. వాస్తవ ఘటనల ఆధారంగా థ్రిల్లింగ్ కానె్సప్ట్‌తో రూపొందించాం. జీ తెలుగు ప్రతినిధులు ఫ్యాన్సీ రేటుకు శాటిలైట్ హక్కులు తీసుకోవడం మాలో ధైర్యం నింపింది. మేలో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం’ అన్నారు.