గ్లామర్‌కూ సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 19న విడుదలవుతోంది. కన్నడ, తమిళ, మలయాళంలో పలు సినిమాలు చేసిన శ్రద్ధ శ్రీనాధ్ ఈ సినిమాతో తెలుగు తెరకు
పరిచయమవుతోంది. సినిమా విడుదల సందర్భంగా శ్రద్ధ శ్రీనాధ్ ముచ్చట్లు.
*
తెలుగు తెలుసు. మాట్లాడగలను. నేను కాశ్మీర్‌లో పుట్టినా, నాన్న ఆర్మీ ఎంప్లాయి కనుక సికింద్రాబాద్‌లో కొంతకాలం చేశారు. అలా, సెవెన్త్ నుంచి ప్లస్ టు వరకు కెవీ తిరుమలగిరిలో చదివి ఆరేళ్లు సికింద్రాబాద్‌లోనే ఉన్నా.
తెలుగులో జెర్సీ ముందు విడుదలవుతోంది కానీ, తొలి సినిమా కాదు. దీనికిముందు రెండు సినిమా అవకాశాలు వచ్చాయి. వాటిలో ఒకటి క్షణం డైరెక్టర్ రవికాంత్ పేరెపు దర్శకత్వంలో. ఇంకా టైటిల్ పెట్టలేదు. ఆది సాయికుమార్‌తో ‘జోడీ’ చేశా. 2017లో రెండింటికీ సంతకం చేశా. కానీ జెర్సీ ముందు విడుదలవుతోంది.
నేను తమిళ, కన్నడలో నటించిన కొన్ని చిత్రాలను జెర్సీ యూనిట్ చూసింది. ఒక రోజు ఫోన్ చేసి జెర్సీ గురించి చెప్పారు. కథ వింటానన్నాను. దర్శకుడు గౌతమ్ బెంగుళూరు వచ్చి రెండు గంటలు నేరేట్ చేశారు. ఇది థ్రిల్లర్ కాదు. ఎమోషనల్ మూవీ. కథ విన్నాక నా పాత్రకు ఎంత వాల్యూ ఉందో అర్థమైంది. అంతే ఓకె చెప్పేశాను.
జెర్సీ బయోపిక్ కాదు. హానెస్ట్ స్టోరీ. హానెస్ట్ ఎమోషనల్ స్టోరీ. క్రికెటర్ అనే కాదు, చాలామందికి జీవితంలో స్ట్రగుల్ ఉంటుంది. ఇది బోయ్ అండ్ గాళ్ మూవీ.
కోఆర్టిస్టుగా నాని ఎవ్వర్నీ దాటేయాలని చూడడు. సో, అతనితో పని చేయడం నాకు ప్రాబ్లెమ్ అనిపించలేదు. భాషపరంగా పెర్ఫెక్షన్ ప్రాబ్లెమ్స్ దాటడానికి నాని చక్కని సహకారం అందించాడు. మన నటనను మరింత గొప్పగా కెమెరా ముందు ఆవిష్కరించేందుకు నిజంగా ఉపయోగపడేది కో-ఆర్టిస్టే. నాని ఆ విషయంలో చాలా హెల్ప్ చేశాడు. తెలుగులో నాని నటించిన సినిమాలేవీ చూడలేదు.
ఇందులో గ్లామర్‌గా, మ్యారీడ్ విమెన్‌గా చేశా. అర్జున, సారా మధ్య ప్రేమ, ఫ్యాషన్ మొత్తం చూపించారు దర్శకుడు. 1986లో బోయ్‌ఫ్రెండ్, గాళ్‌ఫ్రెండ్ అనే పదాలే చాలా డిఫికల్ట్‌గా వినిపించేవి. వాటిని మేం రిఫ్లెక్ట్ చేశాం. 1996లో చూపించే సన్నివేశాలన్నీ రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఇందులో మదర్‌గానూ చేశాను. అలా నటించిన వాళ్లపై ఒక బ్రాండ్ పడుతుంది. అందుకోసం కొంత ఆలోచించా. అయినా ఇలాంటి మంచి కథవున్న సినిమాలు ఎప్పుడోగాని రావు. అందుకే వెంటనే ఒప్పుకున్నా. అందులోనూ ఓన్లీ పెర్ఫార్మెన్స్, ఓన్లీ గ్లామర్ చిత్రాలు చేయడానికీ సిద్ధమే.
మణిరత్నం సినిమా కాబట్టి చెలియాలో చిన్న పాత్రయినా చేశా. నా విష్‌లిస్ట్‌లో రాజవౌళి, త్రివిక్రమ్, తరుణ్ భాస్కర్ పేర్లూ ఈమధ్య యాడ్ అయ్యాయి. భవిష్యత్తులో నా డిమాండ్ ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ ఫోకస్ చేస్తాను. కన్నడ, తమిళంలో ఈక్వెల్‌గా చేస్తున్నా. తెలుగులో ఇప్పుడే మార్కెట్ మొదలైంది. నేను తెలుగులో డబ్బింగ్ చెప్పాలనుకున్నా కానీ కుదరలేదు. నేను లా చదువుకున్నా. రెండేళ్ళు రియల్ ఎస్టేట్ లాయర్‌గా చేశా. మార్చి 2015లో నేను నటనకు వచ్చా. 2016లో కన్నడ యు టర్న్ చేశా. తర్వాత తిరిగి చూసుకోలేదు.

-శ్రీ