బాల్‌రెడ్డిని మరిపించేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోగా నవీన్‌చంద్ర కొత్త చిత్రం మొదలైంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్‌థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రానికి దర్శకుడు సుధీర్‌వర్మ క్లాప్‌నివ్వగా, మరో దర్శకుడు కృష్ణచైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనీల్‌కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వేణు మధుకంటి మాట్లాడుతూ వెంకటాపురానికి దర్శకుడుగా మంచి పేరొచ్చింది. తర్వాత మంచి స్క్రిప్ట్ కోసం టైం తీసుకున్నాం. నిర్మాత మంజునాథ్‌తో కలిసి ఏడాదిగా కథపై వర్క్ చేశాను. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటి వరకూ రాని కథ, కథనాలతో సినిమా ఉంటుంది. వైజాగ్ నేపథ్యంలో సాగే పొలిటికల్ థ్రిల్లర్‌లో ప్రేక్షకుడు ఊహకందని మలుపులుంటాయి. స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీ. ఇప్పటి వరకూ లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు చేసిన నవీన్‌చంద్రను కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నా. జూన్ మొదటివారంలో రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది అన్నారు. నిర్మాత మంజునాథ్ మాట్లాడుతూ యశాస్ సినిమాస్ బ్యానర్‌లో కానె్సప్ట్ బేస్ట్ మూవీ ఇది. వేణు ఐడియా నచ్చి వర్క్ చేస్తున్నాం. ప్రేక్షకులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది అన్నారు. హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ నా కెరీర్‌లో బాల్‌రెడ్డి పాత్ర పెద్దమలుపు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత మంచి పాత్రలు చేస్తున్నా. కథను నమ్మే నిర్మాత దొరకడం మా అదృష్టం. కొత్త టాలెంట్‌ని ప్రోత్సహిస్తున్న ఈ బ్యానర్ నుంచి మరో వంద చిత్రాలు రావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు.