మజిలీ నాకో స్పెషల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య, సమంత, దివ్యాంన్షు కౌశిక్ హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం మజిలీ. సినిమా విజయవంతంగా నడుస్తున్న సందర్భంలో హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ సినిమా కోసం నేనెంత కష్టపడ్డానో అంతకుమించి హీరో హీరోయిన్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మోసిన బాధ్యతల ఫలితమే ఈ విజయమన్నాడు. కష్టాన్ని, సంతోషాన్ని షేర్ చేసుకునే టీం ఉండటంకంటే గొప్ప విషయం మరొకటి ఉండదన్న అంశం ఈ సినిమాతో అర్థమైందన్నాడు. నిన్నుకోరి చిత్రం తరువాత తనకు చాలా ఆష్పన్స్ వచ్చినా, చైతన్యలోని ఆర్టిస్ట్‌ను నమ్మి ఈ సినిమా చేసినట్టు చెప్పాడు. సమంత పెర్ఫార్మెన్స్‌కు క్లైమాక్స్ ఒక్కటిచాలని, చై, సామ్‌లు సినిమాకు లైఫ్ ఇచ్చారన్నాడు. ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, సినిమాకు ప్రాణం పోశారంటూ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘నిన్నుకోరి’ చిత్రం నేలమీదున్నట్టు అనిపించిందని ఆదే విషయాన్ని దర్శకుడు కలిసినప్పుడు చెప్పానని అంటూ, అంతకుమించి ‘మజిలీ’ చిత్రం ఇంప్రెస్ చేసిందన్నారు. పాత్రల చిత్రీకరణ, సన్నివేశాలు రాసుకున్న తీరు డీటెయిల్డ్ వర్క్‌ని తేటతెల్లం చేస్తోందన్నారు. మజిలీ చిత్రానికి సంబంధించి యూనిట్ మొత్తం ఎవరి బాధ్యతలను వారు కచ్చితంగా నిర్వర్తించారు కనుకే మంచి ఫలితం అందిందని ప్రశంసించారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ సినిమా విజయం అనేది దర్శకుడి విజన్‌తో మొదలవుతుంది. ఆ తరువాత ప్రాజెక్టులోకి భాగమయ్యేవాళ్లంతా కలిసి కుటుంబంలా కష్టపడితేనే మజిలీలాంటి ఫలితాలు దక్కుతాయన్నారు. క్రూషియల్ టైంలో శివ ఇచ్చిన మజిలీ హిట్ లైఫ్‌లో ఓ స్పెషల్ అన్నారు. సినిమా కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అన్నారు.