మహా మెగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తరువాత మెగాస్టార్ రూటుమారింది. ఫక్తు కమర్షియల్ సినిమాలు కాకుండా కాస్త భిన్నమైన కథనాలనూ ఎంచుకుంటూ అటు సోషల్ మెసేజ్, ఇటు కమర్షియాలిటీ రెండు ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఖైదీ నెంబర్ 150 తరువాత మెగాస్టార్ నటిస్తున్న సైరా సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల శివతో సినిమా చేయనున్నాడు మెగాస్టార్. దాని తరువాత ఓ క్రేజీ దర్శకుడితో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. నిజంగా ఈ ప్రాజెక్టు సెట్టయితే ఇన్నాళ్ల మెగాస్టార్ కల నిజమవుతుంది. ఆ సినిమాతో మెగాస్టార్ ఇమేజ్ డబుల్ అవ్వడం గ్యారెంటీ? ఇంతకీ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఎవరితోనో కాదు, క్రేజీ డైరెక్టర్ శంకర్‌తో. చాలా రోజులుగా శంకర్‌తో సినిమా చేయాలన్నది మెగాస్టార్ కోరిక. ఇప్పటికే ఈ విషయం గురించి శంకర్‌కి చెప్పాడు. మంచి కథ కుదిరినప్పుడు చేద్దామంటూ శంకర్ చెప్పాడు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌ను సెట్ చేసే పనిలో ఉన్నాడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. చిరంజీవి కోసం ఓ కథను సిద్ధం చేయమని చెప్పాడట అల్లు అరవింద్. ఈ సినిమా తెలుగులో చిరంజీవి అయితే, తమిళంలో విజయ్ కానీ అజిత్ కానీ నటించే అవకాశాలు ఉన్నాయట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం భారతీయుడు -2తో బిజీగావున్న శంకర్, ఈ సినిమా తరువాత మెగాస్టార్‌తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.