బన్నీ.. అప్పుడప్పుడు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్‌లో ప్రొఫెషనలిజం చూపడమంటే -లక్ష్యానికి వేసిన ప్రణాళికను పక్కాగా అమలు చేయడం. అయితే, అన్నిసార్లూ ఇదే రూల్‌ని పాటించలేకపోవచ్చు. ఎందుకంటే -ఒక్కోసారి ప్లాన్‌ను మించి టైం ఫ్యాక్టర్ ప్రభావం చూపించొచ్చు. అటువంటపుడు ప్రణాళికనో, ప్రణాళికలోని విధానాన్నో కాస్త అటూ ఇటూ మార్చుకోక తప్పదు. అల్లు అర్జున్ ఇప్పుడు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నాడు. అందుకే -స్క్రిప్ట్ పక్కాగా వచ్చిన తరువాతే సెట్స్‌పైకి వెళ్లాలన్న పర్సనల్ రూల్‌ని కాస్త సడలించి, కొత్త ప్రాజెక్టును సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ఓకే అన్నాడని టాక్. విషయంలోకి వెళ్తే -స్టోరీ, స్క్రీన్‌ప్లే, క్యారెక్టరైజేషన్ వీటికే అల్లు అర్జున్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని అంటుంటారు. ఈ మూడూ పక్కా.. అనిపించేంత వరకూ బన్నీ సినిమాలో మార్పులు, చేర్పులు తప్పవన్నది అతనితో సినిమాలు చేసిన దర్శకుల మాట. తాజాగా త్రివిక్రమ్‌తో ప్రాజెక్టు ఒకే చేసుకున్న బన్నీ -ఈ విషయంలో కొంత పట్టు సడలించాడట. బన్నీకి త్రివిక్రమ్ వినిపించిన స్టోరీలో ఫస్ట్ఫా మాత్రమే ఓకే అయ్యిందని, సెకెండాఫ్‌లో సూచించిన కొన్ని మార్పులు చేయాల్సి ఉందని తెలుస్తోంది. అయితే, టైంలేని కారణంగా షూటింగ్ మొదలుపెట్టేసి, తరువాత సెకెండాఫ్ సెట్ చేద్దామన్న త్రివిక్రమ్ మాటకు బన్నీ నో అనలేకపోయాడట. అందుకే 24నుంచి షూటింగ్ మొదలుపెట్టేసి -తరువాత కథపై కసరత్తులు జరగొచ్చని అంటున్నారు. త్రివిక్రమ్ ప్రాజెక్టు తరువాత వేణుశ్రీరామ్, సుకుమార్ ప్రాజెక్టుల్ని బన్నీ లైన్లో పెట్టాడు. పైగా ‘నా పేరు సూర్య..’ తరువాత ప్రాజెక్టును ఓకే చేయడానికి చాలా టైమే తీసుకున్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని షూట్ నడుస్తున్నపుడే -సెకెండాఫ్‌ను సెట్ చేసుకునేందుకు త్రివిక్రమ్- బన్నీ నిర్ణయించుకున్నారని టాక్. ప్రాజెక్టులు లేటైనపుడు -ప్లాన్‌లో సవరణలు ఎవరికైన తప్పవు.