సంచలన.. కాంచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, కోవై సరళ, శ్రీమాన్ ప్రధాన తారాగణంగా వస్తోన్న చిత్రం -కాంచన 3. లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రాఘవ నిర్మాణంలో సినిమా నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 19న భారీగా విడుదలవుతోంది. తెలుగులో ప్రముఖ నిర్మాత బి మధు విడుదల చేస్తున్నారు. సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ బ్రోచర్‌ను అల్లు అరవింద్ విడుదల చేసి చిత్రం సంచలన విజయం సాధిస్తుందన్నారు. ఈ సందర్భంగా లగడపాటి శ్రీ్ధర్ మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో నాకు నచ్చిన వ్యక్తుల్లో లారెన్స్ ఒకరు. ఈ సమ్మర్‌కి ఈ సినిమా అందరినీ కూల్ చేస్తుందని అనుకుంటున్నాను. లారెన్స్ కష్టపడే ఈ స్థాయికి చేరుకున్నాడు. అంతకుమించి సొసైటీకి ఛారిటీ ద్వారా సేవ చేస్తున్నాడు. చాలామందికి ఆయన ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. సినిమాలో భయంతోపాటు మంచి వినోదాన్నీ అందిస్తున్నారు అన్నారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ సినిమాలో నాతోపాటు నటించిన వేదిక మునిలో నాతోపాటు నటించింది. లక్కీ హీరోయిన్. ఇపుడు కాంచన 3లో నటించింది. నిక్కీ తంబోలి చాలా చక్కగా కామెడీ నటనతో మెప్పించింది. ఈ సినిమాలో శ్రీమాన్, కోవైసరళ, దేవదర్శినిలు అసలైన హీరోలు. వాళ్లే కామెడీ సీన్స్‌లో అద్భుతం చూపించారు. తెలుగులో విడుదల చేస్తున్న మధుకు థాంక్స్. ఆయన సినిమాను చక్కగా ప్రమోట్ చేశారు. లగడపాటి శ్రీ్ధర్‌తో స్టైల్ సినిమా చేశాను. ఇపుడు ఆయనే స్టైల్ 2 చేద్దామంటున్నారు. తప్పకుండా చేస్తాను. ఈ సినిమా గురించి చాలామంది మాట్లాడారు. చిరంజీవి ఆశీర్వాదంవల్లే ఈ స్టేజ్‌లో ఉన్నా. ఆయన నాకు హిట్లర్ సినిమాలో డాన్స్ మాస్టర్‌గా ఛాన్స్ ఇవ్వకుంటే నెంబర్‌వన్ డాన్స్ మాస్టర్‌ని అయ్యేవాడినికాదు. నాగార్జున డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేవారే కాదు. అలాగే నేనిక్కడ ఛారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను మంచి పనులు చేస్తున్నానంటే కారణం మా అమ్మ. దేవుడే నాలో ఉండి ఈ పనులన్నీ చేయిస్తున్నాడని, నేనొక పనివాడిని మాత్రమేనని అర్థమైంది. నాకు డబ్బులు ఆడియెన్స్ నుంచి కదా వస్తుంది. అలాంటి ఆడియెన్స్‌కు ఏదైనా చేయాలని ఆలోచించి చారిటబుల్ ట్రస్ట్ పెట్టా. 60మంది పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నా. హైదరాబాద్‌లో స్టార్ట్ చేయబోయే ట్రస్ట్‌కు నావంతుగా 50 లక్షల విరాళం ఇస్తున్నా. ఓపెన్ హార్ట్ సర్జరీ, చదువు ఇబ్బందులున్నవాళ్లు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అన్నారు.