‘సాహో’ సెట్స్‌కి ప్రభాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాస్ తాజా ప్రాజెక్టు -సాహో. సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌లో నిర్మితమవుతోన్న సినిమా. ప్రభాస్‌కు జోడీగా శ్రద్ధాకపూర్ కనిపించనుంది. చాలావరకూ చిత్రీకరణ పూర్తిచేసిన ప్రాజెక్టుకు కొద్దిరోజుల క్రితమే బ్రేక్ ఇచ్చారు. ఈ టైంలోనే ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ రూపొందిస్తోన్న ‘జాను’ షూటింగ్‌కు ప్రభాస్ హాజరయ్యాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే కనిపించనుంది. మళ్లీ ‘సాహో’ తాజా షెడ్యూల్ ముంబయిలో మొదలవ్వడంతో, ప్రభాస్ సెట్స్‌కు చేరుకున్నాడట. ప్రభాస్‌తో ఇతర ఆర్టిస్టుల కాంబినేషన్ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. ఆగస్టు 15న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే ఆలోచన ఉంది. ఈ ప్రాజెక్టు ప్రభాస్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ కానుందన్న ఆశల్లో అభిమానులు ఉన్నారు. వివిధ భాషల్లో విడుదలకానున్న సినిమా ఇప్పటినుంచే హీటెక్కిస్తోంది. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.