లిసా.. కొత్త అనుభూతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దెయ్యాల కథలతో తెలుగులో ఎన్నో సినిమాలొచ్చాయి. హారర్ జోనర్‌లో దెయ్యం కానె్సప్ట్ బిగ్ సక్సెస్ ఫార్ములా. ఇప్పుడు అదే ఫార్ములాతో వస్తోంది లీసా. దెయ్యాల్ని లైవ్ 3డిలో తెరకెక్కించారు. 24న సినిమా విడుదలవుతుంది. ఇది రెగ్యులర్ దెయ్యం కథలకు భిన్నం అంటున్నాడు నిర్మాత సురేష్ కొండేటి.
అంజలి టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ కొండేటి మీడియాతో మాట్లాడారు.
హారర్ కానె్సప్ట్‌లో చాలా సినిమాలే వచ్చాయి. కానీ హర్రర్‌లో 3డి సినిమా ఇంతవరకూ లేదు. ఇదే మొదటిది. అందుకే సినిమాకు ఒప్పుకున్నా. అందుకు అంజలి కూడా ఓ కారణం. నేను తెలుగులో విడుదల చేసిన అంజలి సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. ఈ సినిమాపై అదే నమ్మకంతో ఉన్నాం. ముఖ్యంగా సినిమాలో 3డి విజువల్స్ ఫెంటాస్టిక్ అంటున్నారు. నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ సినిమా రెగ్యులర్ ఫార్మేట్‌లో ఉండదు. చాలా కొత్తగా ఉంటుంది. 3డి సినిమాకాబట్టి రోబో టెక్నీషియన్స్ పనిచేసారు. భారీస్థాయిలో తెరకెక్కిన సినిమాను అదే స్థాయిలో విడుదల చేస్తున్నాం. పదిహేనేళ్లక్రితం నేను ప్రేమిస్తే సినిమాతో నిర్మాతగా మారాను. అప్పట్లో ఆ సినిమా సంచలన విజయం అందుకుంది. ఆ సినిమాతో నా బ్యానర్‌కు మంచి విలువ వచ్చింది. ఆ తరువాత నా బ్యానర్‌లో వచ్చిన జర్నీ మంచి విజయాన్ని అందుకుంది. లీసా నా బ్యానర్‌లో వస్తున్న 15వ సినిమా. ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో మంచి హైప్ వచ్చింది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది. ఇక నిర్మాతగానే కాకుండా జర్నలిస్ట్‌గా, సంతోషం పత్రిక ఓనర్‌గా చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది ఆగస్టులో సంతోషం అవార్డ్స్ నిర్వహిస్తా. దాంతోపాటు మా అసోసియేషన్‌లో మంచి పదవిలో ఉన్నాను. పరిశ్రమకు సంబంధించిన ఏ పనైనా చేస్తాను. నాకు చిరంజీవి స్ఫూర్తి. భవిష్యత్తులో దర్శకత్వం కూడా చేయొచ్చు. నా బ్యానర్‌లో నెక్స్ట్ సినిమాగా షకలక శంకర్‌తో శ్రీకాకుళం అనే సినిమా ప్లాన్ చేస్తున్నాం అంటూ వివరించారు.