రాణీముఖర్జీకి ఆడపిల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నటి రాణిముఖర్జీ తల్లయింది. ముంబైలోని బ్రీచ్‌కాండి ఆస్పత్రిలో ఆమె ఇవాళ ఆడపిల్లను ప్రసవించింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. నిర్మాత ఆదిత్యచోప్రాను గతేడాది ఏప్రిల్ 21న వివాహం చేసుకున్న రాణిముఖర్జీ దంపతులు తమ గారాలపట్టికి ‘అదీర’ అని పేరుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని మరో నిర్మాత కరణ్‌జోహార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాణికి పండంటి ఆడపిల్ల పుట్టిందని, తనను మామను చేసిందని ఆయన సంతోషాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. ఇక రాణిముఖర్జి, ఆదిత్య చోప్రాలకు అభినందనలు వెల్లువెత్తాయి. రితేష్ దేశ్‌ముఖ్, పరిణీతి చోప్రా, రిషకపూర్ తదితరులు వారికి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో అభినందులు చెప్పారు.