ఇష్క్.. ఎప్పుడూ రిస్కే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ 2 మనసులు’ చిత్రంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ప్రముఖ వ్యాపారవేత్త ఎస్.చంద్రశేఖర్.. ఆ చిత్రం నిర్మాణంలో వుండగానే, మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. జెయస్సార్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శేఖర్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు ‘ఇష్క్ ఈజ్ రిస్క్’. రవిచంద్ర, యుగా యుగేష్, సాయిశ్రీవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌కింగ్ దర్శకుడు. జీవా, చమ్మక్‌చంద్ర, తాగుబోతు రమేష్, నల్ల వేణు, బండ రఘు, మాధవి, జబర్దస్త్ పవన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్, మాదాపూర్‌లోని డీజీపీ గెస్ట్‌హౌస్‌లో మొదలై ప్రస్తుతం మణికొండలోని మన స్టూడియోలో షూటింగ్ జరుపుకొంటోంది. చిత్ర నిర్మాత ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘హాస్యానికి పెద్దపీటవేస్తూ రూపొందుతున్న లవ్ ఎంటర్‌టైనర్’ ఇష్క్ ఈజ్ రిస్క్. మంచి టీమ్ కుదిరింది. మంచి ఔట్‌పుట్ వస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. దర్శకుడు రాజ్‌కింగ్ మాట్లాడుతూ.. దర్శకుడిగా ఇది నా రెండో చిత్రం. ‘ఇష్క్ ఈజ్ రిస్క్’. చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన మా నిర్మాత ఎస్.చంద్రశేఖర్‌గారికి థ్యాంక్స్ అన్నారు.