సిగ్గుపడుతున్నా.. జాగ్రత్తపడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజిత్ క్రేజ్ తమిళంలోనే కాదు, తెలుగులోనూ తక్కువేం కాదు. వరుస సినిమాలు. గురితప్పని విజయాలు. నిజానికి అజిత్ ట్రాకే సెపరేట్. నటనపరంగానే కాదు, ఆఫ్‌స్క్రీన్‌లోనూ అజిత్ వ్యక్తిత్వంపై ప్రశంసలే తప్ప విమర్శలుండవు. అలాంటి అజిత్ -కెరీర్ తొలినాళ్లలో చేసిన సినిమాలను తనే విమర్శించుకుంటున్నాడు. ఇకపై అలాంటి పాత్రలు చేయనంటూ ప్రామిస్ చేస్తున్నాడు కూడా. ప్రస్తుతం హిందీ ‘పింక్’ను ‘నెర్కొండ పార్వై’ పేరిట తమిళం రీమేక్‌తో అజిత్ బిజీగా ఉన్నాడు. హెచ్ వినోత్ తెరకెక్కించిన సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ సందర్భంలోనే సినిమాను ఓమెట్టు పైకి తీసుకెళ్లే కామెంట్ చేశాడు అజిత్. ‘కెరీర్ ప్రారంభంలో మహిళలను ఇబ్బంది పెట్టే పాత్రలు కొన్ని చేశాను. జీవితంపట్ల అంతగా అవగాహన లేని టైమ్ అది. కానీ, అలాంటి పాత్రలు చేసినందుకు మాత్రం ఇప్పుడు చాలా బాధపడుతుంటాను. మరోసారి అలాంటి పొరబాట్లు చేయను. మహిళల ఔన్నత్యాన్ని గౌరవించే ఆదర్శవంతమైన పాత్రలే చేయాలనుకుంటున్నా. ఆ అడుగులు నెర్కొండ పార్వైనుంచే మొదలయ్యాయేమో అంటున్నాడు అజిత్. తాజాగా విడదలైన ట్రైలర్‌లో అజిత్ పెర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంది. అజిత్ కోర్ట్ ఆర్గ్యుమెంట్స్, యాక్షన్స్ ఎపిసోడ్స్‌తో కట్ చేసిన ట్రైలర్ -హిట్టయిన సినిమా రీమేక్‌పై మరింతగా అంచనాలు పెంచుతోంది.