జోరుపెంచాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు ఊపుమీదున్న నితిన్‌కు వరుస పరాజయాలు ఎదురుకావడంతో -కథలపై కాస్తంత ఫోకస్ పెట్టడం మొదలెట్టాడు. కథల ఎంపికలో జరిగిన పొరబాట్లే పరాజయాలకు కారణమని భావించిన నితిన్ -కొంత గ్యాప్ తరువాత సరైన కథలతో మళ్లీ దూకుడు మొదలెట్టాడు. ‘మళ్లీ వస్తున్నా.. వరుస ప్రాజెక్టులు ప్రకటిస్తా’నంటూ ఆమధ్య ఫ్యాన్స్‌కి ట్వీట్లు చేసిన నితిన్ -అన్నట్టుగానే ఒకదాని వెనుక ఒకటి ప్రాజెక్టులు ప్రకటించేశాడు. ప్రస్తుతం నితిన్ చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి. కొద్దిరోజుల క్రితం దర్శకుడు వెంకీ కుడుములతో భీష్మ’ ప్రాజెక్టును మొదలెట్టడం తెలిసిందే. ముందుగా ఈ ప్రాజెక్టునే నితిన్ పూర్తి చేయనున్నాడు. ఈ ప్రాజెక్టులో నితిన్‌తో లేటెస్ట్ సెనే్సషన్ రష్మిక మండన్నా జోడికడుతోంది. రెండు రోజుల క్రితం చంద్రశేఖర్ యేలేటితో నితిన్ మరో ప్రాజెక్టుకు పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రాజెక్టును వి ఆనందప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -్భవ్య క్రియేషన్స్ నుంచి ఎలాంటి చిత్రాలు వచ్చాయో ఆడియన్స్‌కి తెలీంది కాదు. నితిన్‌కు పక్కాగా సరిపోయే స్టోరీ ఇది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి సోరీ పాయింట్ వైవిధ్యంగా ఉంటుంది. ఈ కాంబినేషన్‌లో వస్తోన్న కొత్త ప్రాజెక్టుపై నమ్మకంగా ఉన్నాం’ అన్నారు. ఈ ప్రాజెక్టులో నితిన్‌తో రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ జోడీ కట్టనున్నారు. సంగీతం కీరవాణి సమకూరుస్తున్నారు. ఇతర నటీనటులు, షూటింగ్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. ఒకటి సెట్స్ మీదుంది, రెండోది సెట్స్‌పైకి వెళ్లాల్సివున్న టైంలోనే మూడో ప్రాజెక్టునూ లైన్లో పెట్టేశాడు నితిన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించనున్న ప్రాజెక్టుకు టైటిల్ కన్ఫర్మ్ చేస్తూ తాజాగా పోస్టర్ విడుదల చేశారు. ‘రంగ్‌దే’ పేరిట ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి తెరకెక్కించనున్నాడు. ఈ ప్రాజెక్టులో నితిన్‌తో కీర్తిసురేశ్ జోడీ కట్టనుంది.