18న రాక్షసుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న చిత్రం -రాక్షసుడు. ఏ స్టూడియోస్ బ్యానర్‌పై హవీశ్ ప్రొడక్షన్‌లో వస్తోన్న చిత్రానికి రమేశ్‌వర్మ దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలోవున్న సినిమాను హక్కులను అభిషేక్ పిక్చర్స్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుంది. జూలై 18న అభిషేక్ పిక్చర్స్ ద్వారా రాక్షసుడు విడుదల కానున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ ‘్ఫబ్రవరి 21న మొదలైన రాక్షసుడు నిరంతరంగా 85 రోజులు షూటింగ్ జరుపుకుంది. మొదలుపెట్టిన రోజు నుంచే మంచి సినిమా చేస్తున్నామన్న భావన కలిగింది. అందుకు తగ్గట్టుగానే సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. అన్ని పనులు పూర్తిచేసి, అభిషేక్ ఫిలింస్ ద్వారా జూలై 18న సినిమా విడదలకు ప్లాన్ చేశాం’ అన్నారు. దర్శకుడు రమేశ్‌వర్మ మాట్లాడుతూ ‘నాకు అవకాశమిచ్చిన నిర్మాత కోనేరు సత్యనారాయణకు కృతజ్ఞతలు. మంచి టీం కుదిరింది. సినిమాకోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అన్నారు.