అవంతిక.. అటూ ఇటూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని నాగార్జునను మరోసారి మన్మధుడిగా చూపిస్తూ హీరో, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న తాజా ప్రాజెక్టు -మన్మధుడు 2. రకుల్‌ప్రీత్, కీర్తిసురేష్ హీరోయిన్లు. రెండో మన్మధుడి ఆటిట్యూడ్‌ను రుచిచూపిస్తూ కొద్దికాలం క్రితమే టీజర్‌ను విడుదల చేయడం తెలిసిందే. టీజర్‌లో ఎంతో ఉత్సాహంతో నాగార్జున ఆకట్టుకున్నాడు. అయితే, ఫస్ట్ టీజర్‌లో హీరోయిన్ రకుల్ ఎక్కడా కనిపించలేదు. రకుల్ పాత్రకు అంత సీన్‌లేదా అన్న సందేహాలు ముసరడంతో.. తాజాగా ఆమె పాత్రను అవంతికగా పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే, ఆమె చేసే చిలిపితనం, అల్లరితనం, కొంటెతనాన్ని వీడియోలో చూపించారు. ‘అవంతిక.. పేరు ఎంత సూపర్బ్‌గా ఉందో అంతే పద్ధతిగల అమ్మాయి’ అంటూ రకుల్‌ను పరిచయం చేస్తూనే -్భన్నంగా ఊరమాస్ ప్రవర్తనను టీజర్‌లో కట్ చేశారు. ‘ఇప్పటిదాకా ‘యు’ సర్ట్ఫికెట్ కోసం ప్రయత్నించాను. ఇప్పుడు ఏ సర్ట్ఫికేట్ చూపిస్తాను’ అంటూ అవంతిక చెప్పే డైలాగులోనే పాత్ర స్వభావం అర్థమవుతుంది. అయతే, ఈ డైలాగ్ రకుల్ కెరీర్ లైఫ్‌కు కూడా అన్వయంచుకోవాలా? అంటూ ట్రోల్స్ మొదలవడం విశేషం. వీడియోలో రకుల్ స్మోకింగ్ సీన్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు, ఫైర్లు నడుస్తుండటం విశేషం. అందుక్కారణం -అర్జున్‌రెడ్డి సినిమా విడుదల టైంలో ఆ పాత్ర స్వభావంపై తీవ్రమైన కామెంట్లు చేసిన వాళ్లలో రకుల్ కూడా ఉంది. ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? అన్న ప్రశ్నల్ని సందిస్తున్నారు నెటిజనులు. పైగా ఆమధ్య బాలీవుడ్‌లో అజయ్ దేవ్‌గన్‌తో చేసిన సినిమాలోనూ పబ్లిక్ ప్లేస్‌లో లిక్కర్ బాటిల్‌తో పార్టీ సాంగ్ ప్లే చేసినపుడూ విమర్శలు తప్పలేదు. ఆ నీతులన్నీ ఇప్పుడేమయ్యాయంటూ ట్రోల్స్ మొదలెట్టారు. మరిన్ని చాన్స్‌ల కోసమే రకుల్ ఈ తరహా సన్నివేశాలకు సై అంటోందంటూ కామెంట్లూ మొదలయ్యాయ.
ఇదిలావుంటే, ‘రెండేళ్లుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా’నంటూ నాగార్జున చెప్పినపుడు రకుల్ పడిపడి నవ్వుతూ -‘ఈ వయసులో నువ్వు లవ్ ఫెయిల్యూర్ తట్టుకోలేవ్’ అంటూ కామెడీ చేయడం బావుంది. సీనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి, వెనె్నల కిషోర్ తరుతరులు నటిస్తున్న చిత్రం ఆగస్టు 9న థియేటర్లకు రానుంది.