గట్టిగా చెబుతున్నా.. హిట్టు సినిమా తీశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిను వీడని నీడను నేనే.
ఇదొక -న్యూ ఏజ్ హారర్ ఫిల్మ్. అందరి మంచి కోరే హీరో ప్రభాస్ ఈ సినిమా ఫస్ట్ టికెట్ లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి కల్పించే ప్రయత్నంతో చేసిన సినిమా ఇది. ఎంజాయ్ చేయండి.
-హీరో సందీప్ కిషన్
*
నా సినిమా ఫంక్షన్స్‌లో మంచి సినిమా తీశామనే చెప్తుంటాను. ఫస్ట్‌టైం చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నా, పక్కా హిట్టయ్యే సినిమా తీశానని. నా కెరీర్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సినిమా -‘నినువీడని నీడను నేనే’ అంటున్నాడు హీరో సందీప్ కిషన్. కార్తీక్‌రాజు దర్శకత్వంలో సందీప్- అన్యసింగ్ జోడీగా తెరకెక్కిన చిత్రమిది. దయా పనె్నం, విజి సుబ్రహ్మణియన్ సహ నిర్మాతలు. నేడు ఆడియన్స్ ముందుకొస్తున్న సందర్భంలో హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. యువ హీరోలు నిఖిల్, సుధీర్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో హీరో సందీప్ ఎమోషనల్‌గా మాట్లాడాడు. ఎన్నో కష్టాలకు ఎదురొడ్డి సినిమా నిర్మిస్తే, విడుదల సమయానికి ఎన్నో అడ్డంకులు సృష్టించారన్నారు. ఎదురొచ్చిన చిక్కులు చూసి తానూ, సహ నిర్మాతలు షాక్‌కు గురయ్యామని, అసలు సినిమాను విడుదల చేయగలమా? లేదా? అన్న సందిగ్దత ఎదురైందన్నారు. అయితే మనసుపెట్టి చేసే మంచి ప్రయత్నాన్ని అడ్డంకులు ఆపలేవన్న విషయం తమకు అనుభవైకమైందని అంటూనే, నిజాయితీయే తమను ముందుకు నడిపించిందన్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు.. సినిమా కోసం ప్రాణంపెట్టి అహర్నిశలూ పనిచేసిన వాళ్లు ఎందరో ఉన్నారని, వాళ్ల కష్టమే -నినువీడని నీడను నేనే అన్నారు. ఇలాంటి కథ తన దగ్గరకు రావడం అదృష్టమైతే, ఆ కథను అద్భుతంగా తెరకెక్కించే టీం దొరకడం మరో అదృష్టమన్నారు. హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ -సాధారణంగా సినిమా హిట్టు ఫ్లాపుల రేటింగ్ హీరోకి తగిలిస్తారని, ఈ సినిమాకు సందీప్ నిర్మాత కూడా కావడంతో అన్నీ అతనికి తగిలించేయొచ్చని చమత్కరించాడు. తాను కలిసిన మంచి నటుల్లో సందీప్ కిషన్ ఒకడంటూనే, అతని పొటెన్షియాలిటీ ఇంకా ప్రేక్షకులకే తెలీడంలేదన్నాడు. మనసుపెట్టి చేసిన సినిమా ఎప్పటికీ నిరాశపర్చదని, సందీప్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం బలంగా ఉందన్నాడు. దర్శకుడు కార్తీక్‌రాజు మాట్లాడుతూ -ఈ సినిమా నాకు వెరీ స్పెషల్. సందీప్‌కిషన్‌కు స్క్రిప్ట్ వినిపిస్తే నటించడానికే కాదు నిర్మించడానికీ రెడీ అన్నాడు. ఈ ప్రాజెక్టు ఇంతవరకూ రావడానికి సహకరించిన దయాపనె్నం, సుబ్రమణియన్‌కు కృతజ్ఞతలు. నిజాయితీతో ప్రాణంపెట్టి తీసిన సినిమాను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ టీం మొత్తంలో ఉంది అన్నాడు.