రాయుడి బయోపిక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిను వీడని నీడను నేనే -అంటూ ఓ థ్రిల్లర్‌తో మురిపించాడు యంగ్ హీరో సందీప్ కిషన్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ దగ్గరే సక్సెస్ ఆగిపోవడంతో -తరువాత చేసిన సినిమాలేవీ సందీప్ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోయాయి. సరైన సక్సెస్ సంకల్పంతో నిర్మాతగానూ మారిన సందీప్‌కు ఎన్‌విఎన్‌ఎన్ -ఒకింత సంతృప్తినిచ్చినట్టే. ఆ ఊపుతోనే కొత్త ప్రాజెక్టుపై మరింత కేర్ తీసుకుంటున్నాడట. అందులో భాగంగానే ఓ క్రికెటర్ బయోపిక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఇండస్ట్రీ టాక్.
స్పోర్ట్స్ నేపథ్యంగా ‘గురు’, ‘జెర్సీ’లాంటి సినిమాలు మంచి హిట్లందుకుంటే -తాజాగా ‘శైలజా కృష్ణమూర్తి’ చిత్రం కూడా విడుదలకు సిద్ధమైంది. మరోపక్క కొరటాల ప్రాజెక్టులో చిరంజీవి ‘కోచ్’గా కనిపించొచ్చన్న టాక్ లేకపోలేదు. అలాగే క్రికెటర్ బయోపిక్‌లో సందీప్ కనిపించొచ్చనీ వినిపిస్తోంది. వరల్డ్ కప్ టైంలోనే రిటైర్మెంట్ ప్రకటించి, సెలెక్టర్లపై సంచలన ఆరోపణలు చేసిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడి కథతో సినిమా చేయాలన్న ప్లాన్‌తో సందీప్ ఉన్నట్టు తెలుస్తోంది. రాయుడి బయోపిక్ చేయమంటూ ట్విట్టర్‌లో నెటిజన్లూ కోరుతున్నారు. రాయుడు అంగీకరిస్తే బయోపిక్ చేస్తానంటూ సందీప్ సైతం రిప్లై ఇచ్చాడు. అందుకు తగిన కథ కూడా సిద్ధం కావాలంటున్నాడు. ఆలోచన పుట్టింది కనుక -ఆచరణ అసాధ్యం కాదన్నట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం సందీప్‌కిషన్ రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒకటి -వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ 2 తెస్తుంటే, రెండోది జి నాగేశ్వర రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న తెనాలి రామకృష్ణ బిఏబిఎల్. హన్సిక హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న సినిమా దసరాకు థియేటర్లకు రావొచ్చు. మరి -రాయుడి కథను ఎప్పుడు మొదలెడతాడో చూడాలి.