కోల్డ్ స్టోరీని ఎమోషన్స్‌తో చెప్పా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలకు ఇంపార్టెన్స్ పెరుగుతోంది. అందుకు ‘క్షణం’ సినిమా
ఓ ఫ్లాట్‌ఫాం అనిపిస్తోంది. ఏజెంట్
సాయి శ్రీనివాస ఆత్రేయ,
బ్రోచేవారెవరురా.. లాంటి చిత్రాలు
విజయాలను అందుకోవడాన్ని ఇక్కడ
ప్రస్తావించాలి. క్షణం మాడ్యూల్‌ని మరోసారి రిపీట్ చేద్దామన్న ఆలోచనతో పీవీపీ ఎవరు?కి ప్లాన్ చేశారు. ఇది బాగా
వర్కౌటైంది. ఈ మాడ్యూల్‌ని అడాప్ట్ చేసుకుని ఫ్యూచర్‌లో చాలా సినిమాలే
వస్తాయనుకుంటున్నా.

ఏ జోనర్‌లో కథనైనా నేటివిటీకి అనుగుణంగా మార్చుకుంటే -ఆ కథకు ఆడియన్స్ కనెక్టవ్వడం ఖాయం’ అంటున్నాడు దర్శకుడు వెంకట్ రాంజీ. అడవి శేష్ హీరోగా పీవీపీ బ్యానర్‌పై తెరకెక్కించిన ఎవరు? చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు రాంజీ. ఆడియన్స్‌కు సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ అనుభూతినిస్తోన్న ఎవరు? చిత్రం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. సినిమాకు మంచి టాక్ రావడంతో
-ఆదివారం మీడియాతో ముచ్చటించాడు.
‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ సినిమా రీమేక్‌కు సిద్ధమైన తరువాత, కోర్ కంటెంట్‌ను అడాప్ట్ చేసుకుని నేటివిటీ ఎమోషన్స్‌తో కథ రాయాలనిపించింది. అలా, అడవి శేష్, అబ్బూరి రవి సజెషన్స్‌తో ఈ కథను సిద్ధం చేశాం. స్క్రిప్ట్ రాస్తున్నపుడే ఎడిటెడ్ వర్షన్ రాశాను. అందుకే -118 పేజీల స్క్రిప్ట్‌ను 118 నిమిషాల నిడివి సినిమా చేయగలిగాం.
నిజానికి కథగురించి నిర్మాతతో డిస్కషన్స్ జరుగుతున్న టైంలోనే ‘బద్‌లా’ రెడీ అవుతోందని తెలుసు. అప్పటికే కథ విషయంలో ఫిక్సైపోయాం కనుక, ఎలాంటి మార్పులూ చేయలేదు. హత్య జరిగిన గదిలో మూడో వ్యక్తి మరొకరున్నారన్న కోణంలో ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ సినిమా ఉంటుంది. ఫస్ట్ నేను ఆ పాయింట్‌నే తీసేశాను. దాంతో కథా స్వరూపం మారిపోయింది. కొత్త కథ అన్న భావన కలిగింది. అదే ఎవరు?కు పెద్ద అస్సెట్.
మాతృక విషయంలో ఫస్ట్‌నుంచీ క్లారిటీగా ఉన్నా. ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ అనేది కోల్డ్ మూవీ. మన ప్రేక్షకులకు రుచించదు. అందుకే అదే కథను ఎమోషన్స్‌తో చెప్పాలనుకున్నా. రిపీట్ వాల్యూ రావాలంటే ఎమోషన్స్ ఉండాలన్న ఆలోచన సరిగ్గా వర్కౌటైంది.
సినిమా షూట్ జరుగుతున్నపుడు -డిసెంబర్‌లో కట్స్ చూశా. అప్పటికింకా 40 శాతం సినిమా షూటింగ్ చేయాల్సి ఉంది. అదే టైంలో కీలకమైన హోటల్ సీన్స్ షూట్ చేస్తున్నాం. అక్కడ ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్ చూసిన తరువాత -నేను పూర్తి కాన్ఫిడెంట్‌కు వచ్చేశా. అప్పడే చెప్పాను, ఇదే ట్రాక్‌లో ముందుకెళ్తే సినిమా వర్కౌటవుతుందని. నమ్మకం నిజమైంది.
నేను షూట్ చేసిన కట్స్‌ని ఎక్కువసార్లు చూడను. ఎందుకంటే చూసేకొద్దీ -దర్శకుడిగా తప్పులు దొరుకుతాయి. అందుకే -పని చేసేముందే క్వాలిటీని ఆలోచిస్తా. డిసెంబర్‌లో కట్స్ చూసిన తరువాత -మళ్లీ సినిమా పూరె్తై ఎడిటింగ్ టేబుల్ మీదకు వచ్చాకే షూట్ చేసిన పార్ట్‌లు చూసుకున్నా. అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాం, సినిమా విషయంలో.
ఎవరు? సినిమా ఎ సెంటర్స్ ఆడియన్స్‌కి కనెక్టవుతుందని నేను వేసిన అంచనా మాత్రం తప్పింది. బి, సీ సెంటర్ల ఆడియన్స్ సినిమాకు, విక్రమ్ పాత్రకు బాగా కనెక్టయ్యారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే -వాళ్ల అనూహ్యమైన రియాక్షన్స్ ఆనందాన్నిచ్చాయి.
దర్శకుడిగా తొలి చిత్రానే్న రీమేక్ చేయడానికి ప్రత్యేకమైన కారణాలంటూ లేవు. నేను రాసుకున్న కథ చెప్పడానికి పీవీపీకి వచ్చినపుడు -నిర్మాత తన దగ్గరున్న పాయింట్ చెప్పారు. ‘మిస్సైన తండ్రిని వెతుక్కుంటున్న కొడుకు’ కథ. పాయింట్ నచ్చింది. తరువాత ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ సినిమా ప్రస్తావించారు. అప్పటికే నేను సినిమా చూశానుకానీ, అదో రివేంజ్ డ్రామా అన్న ఫీల్‌తోనే ఉన్నా. నిర్మాత చెప్పిన పాయింట్‌లో మళ్లీ సినిమా చూసిన తరువాత -కథను వర్కౌట్ చేశాం.
లీడ్‌రోల్ కోసం శేష్‌ను ఎంపిక చేసింది నేను కాదు, నిర్మాత పీవీపీనే. అప్పటికి శేష్, నేను కొన్ని సినిమాలకు మార్కెటింగ్ టీంలో వర్క్ చేశామంతే. పీవీపీతో శేష్ అప్పటికి ‘క్షణం’ సినిమా చేసి ఉన్నాడు కనుక, ఈ కథకూ తనే బావుంటుందని నిర్మాత పీవీపీనే మాట్లాడారు.
సామ్ పాత్రకు రెజీనా ఎంపిక నాదే. ఆమె కళ్లు చాలా ఎక్స్‌ప్రెసివ్. సామ్ పాత్రలో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. పర్టిక్యులర్ సీన్‌లో చూపించాల్సిన లేయర్‌కు కాస్త అటూ ఇటూ వెళ్లినా -ఆడియన్స్ మూడ్ దెబ్బతింటుంది. కథను అంచనా వేసే ప్రమాదమూ ఉంది. నా చాయిస్‌లో -సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగల ఆర్టిస్టుగా ఆమెను ఎంపిక చేసుకున్నా. డైలాగ్ లేకుండా కళ్లతో పలికించే భావాలు సినిమాలో క్లోజప్ షాట్స్‌గా పడ్డాయి అందుకే. పైగా, నేను కథను నెరేట్ చేస్తున్నపుడే -ఆమె సామ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినట్టనిపించింది. ఇక రెండో ఆలోచన చేయలేదు.
కొన్ని పాత్రల ఎంపిక విషయంలో ఆప్షన్స్ పెట్టుకోలేదు. నేను ఎవరిని అనుకున్నానో, వాళ్లను ఒప్పించి మరీ ఎంపిక చేసుకున్నాం. అందులో మురళీ శర్మ కూడా. కాకపోతే, లీడ్‌రోల్స్ మాత్రమే చేస్తున్న నవీన్‌చంద్ర ఈ పాత్ర చేస్తాడా? అన్న చిన్న డౌట్ ఉండేది. అరవింద సమేతలో ఆయన చేసిన పాత్ర చూసిన తరువాత అప్రోచ్ అయ్యాను. కథ విని ఓకే చెప్పేశాడు. ఇక -నీహాల్ పాత్ర నా ప్రాధాన్యతల్లో లాస్ట్. కాకపోతే తన పెర్ఫార్మెన్స్‌తో చాలా ముందుకొచ్చేశాడు.
ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. కొత్త ఆర్టిస్టుల్ని కలవాలి. కొంచెం టైంపట్టొచ్చు. నేనిక్కడ ఉన్నానంటే -కారణం పీవీపీ. ఇంతకుముందు నేను ఏ కథను చెప్పాలనుకున్నానో -అదే ఇప్పుడు బయటకు రావొచ్చేమో కూడా. అదీ థ్రిల్లర్ కానె్సప్టే. బట్, ఇంకా ఏదీ క్లారిటీ లేదు.

-మహాదేవ