ఇష్క్ దర్శకుడితో..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రస్తుతం అల్లు అర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు చేయనటువంటి యాక్షన్‌ను బన్నీ చేస్తున్నాడట. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశలో వుంది. బోయపాటి శైలిలో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘సరైనోడు’ అనే టైటిల్‌ను పెట్టే ఆలోచనలో వుంది యూనిట్. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ తదుపరి చిత్రానికి అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయట. తెలుగులో ‘ఇష్క్’, ‘మనం’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందట. ఈ విషయాన్ని దర్శకుడు విక్రంకుమార్ ఓ ఇంటర్వ్యూలో కన్‌ఫర్మ్ చేశాడు. ఇప్పటికే వీరిమధ్య కథా చర్చలు కూడా జరిగినట్టు తెలిసింది. ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.