సాఫ్ట్‌వేరు.. పల్లెటూరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల.. వైకుంఠపురంలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్నది కొత్త టాక్. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండటం తెలిసిందే. పల్లెటూరి కుర్రాడు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీరు.. రెండు పాత్రల్లో బన్నీ కనిపిస్తాడనేది ఫిల్మ్‌నగర్ టాక్. సాఫ్ట్‌వేర్ కుర్రాడి సహోద్యోగితో సాగే లవ్‌ట్రాక్‌లో పూజాహెగ్దె కనిపిస్తుందట. శ్రీమంతుల బిడ్డగా అలకనంద పాత్రలో కనిపించనున్న పూజాహెగ్దే కోసం ఇంటి సెట్‌ను ప్రత్యేకంగా వేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో వేస్తోన్న భారీ సెట్ కోసం 5 కోట్లు వెచ్చించనున్నారన్న కథనాలు వినిపిస్తున్నాయి. టబు, బొమన్ ఇరానీలపైనా ఈ సెట్‌లోనే సీన్స్ చేస్తారని, ఓ పాటా ఇక్కడే చిత్రీకరించొచ్చని వినిపిస్తోంది. ద్విపాత్రాభినయంలో మరి పల్లెటూరి కుర్రాడికి ఫిమేల్ రోల్ ఎవరు? అసలు ఉంటుందా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. సంక్రాంతి సినిమాగా సిద్ధమవుతోన్న ఈ ప్రాజెక్టుతో త్రివిక్రమ్ -బన్నీ కాంబోకు హ్యాట్రిక్ హిట్ ఖాయమన్న అంచనాలు లేకపోలేదు. సినిమాను గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.