కౌసల్యతో నెరవేరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో పాతిక సినిమాలు చేసినా -తెలుగుకు రావడానికి మంచి కథ కోసం ఎదురు చూశా. అది కౌసల్య కృష్ణమూర్తితో నెరవేరింది అంటోంది ఐశ్వర్య రాజేష్. రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెనె్నల కిషోర్ ముఖ్యపాత్రల్లో దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు తెరకెక్కించిన చిత్రం -కౌసల్య కృష్ణమూర్తి. తమిళ చిత్రం ‘కణ’కు రీమేక్. సినిమా విడుదల సందర్భంలో ఐశ్వర్య ఇంటర్వ్యూ.
పుట్టి పెరిగింది చెన్నైలో. అక్కడ సినిమాలు చేశాను. మల్లెమొగ్గలు, రెండు జళ్ల సీతవంటి చిత్రాల్లో చేసిన రాజేష్ మా నాన్న. హాస్య నటి శ్రీలక్ష్మి నాకు మేనత్త. నటుడు అమర్‌నాథ్ మా తాతగారు.
తమిళంలో కణ మంచి సక్సెస్ అయ్యింది. అయినా కొన్ని సన్నివేశాల్లో ఇంకా బాగా చేసివుంటే బాగుండేదనిపించేది. తెలుగులో మళ్లీ అదే పాత్ర చేసే అవకాశం రావడంతో, ఇంప్రొవైజ్ చేశాను. ఆడియన్స్ ఆదరిస్తారనే అనుకుంటున్నా.
సీనియర్ ఆర్టిస్ట్ రాజేంద్రప్రసాద్‌తో ఇది తొలి సినిమా. ఆయన మా నాన్నకు మంచి ఫ్రెండ్. తమిళంలో సత్యరాజ్‌తో ఎంత మంచి వైబ్స్‌వుందో, ఇక్కడ రాజేంద్రప్రసాద్‌తో అలాంటి ఫీల్ కలిగింది.
తెలుగు మాట్లాడతాను, చదువుతాను. తిరుపతిలో శ్రీవిద్యానికేతన్‌లో నాలుగైదేళ్లు చదివా. తరువాతే చెన్నైకి షిఫ్టయ్యాం.
క్రికెట్ బ్యాక్‌డ్రాప్ సినిమా కావడంతో, ఫీల్ పెర్ఫెక్షన్ కోసం ఫిమేల్ కోచ్‌ని పెట్టుకుని ప్రాక్టీస్ చేశా. షూటింగ్ గ్యాప్‌లోనూ ప్రాక్టీస్ చేసేదాన్ని. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో కొంత మెళకువ తెలిసింది. తెలుగులో స్కిల్స్‌ని పాలిష్ చేసుకున్నా.
కౌసల్య పాత్రలో వైవిథ్యమే అట్రాక్ట్ చేసింది. తమిళంలో ‘కాకముట్టై’లో ఇద్దరు పిల్లల తల్లిగా నటించా. మలయాళంలో 70యేళ్ల వృద్ధురాలి పాత్రనూ చేశా. హిందీలోనూ 16 నుండి 65ఏళ్ల వయస్సు పాత్ర చేశా. వైవిధ్యాన్ని బాగా ఇష్టపడతాను.
ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఆశపడితే చాలదు.. పట్టుబట్టి సాధించాలి అని. ఆ డైలాగ్‌కి అచ్చమైన అర్థం నిర్మాత కెఎస్ రామారావు. ఈ ప్రాజెక్టు వెనుక అంతా ఆయనే.
తరువాతి ప్రాజెక్టుగా ఇదే బ్యానర్‌లో -క్రాంతిమాధవ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ సరసన ముఖ్య పాత్ర చేస్తున్నా. ఇప్పటికే చేసిన ‘మిస్‌మ్యాచ్’ విడుదల కావాల్సి ఉంది.