రియల్ హీరోలపై గౌరవంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ భద్రత కోసం సరిహద్దుల్లో రేయింబవళ్లు పహారాకాస్తున్న నిజమైన హీరోలకు మేమిచ్చే గౌరవమే ‘బందోబస్తు’ చిత్రం అన్నారు హీరో సూర్య. సూర్య నటించిన తాజా తమిళ చిత్రం -కాప్పాన్. దర్శకుడు కెవి ఆనంద్ తెరకెక్కించిన చిత్రాన్ని ఎన్వీఆర్ బ్యానర్‌పై తెలుగులో ఎన్వీ ప్రసాద్ బందోబస్తు టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 20న థియేటర్ల వస్తోన్న చిత్రానికి సంబంధించి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో హీరో సూర్య మాట్లాడుతూ -లైకా ప్రొడక్షన్స్ నుంచి వస్తోన్న బందోబస్తు భారీ తారాగణం, ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కింది. ఇది పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్. జర్నలిస్ట్ నేపథ్యం నుంచి వచ్చిన దర్శకుడు కెవి ఆనంద్ -సామాజిక సంఘటనల ఆధారంగానే కథలు రాసుకుని తెరకెక్కిస్తుండటం గొప్ప విషయం. రక్షణ దళాల అధ్యయన కోణం నుంచి ఆయన మదిలో పుట్టిన కథే బందోబస్తు. చిత్రంలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండో పాత్ర పోషించాను. అందుకోసం ఎంతోమంది సైనిక వీరులను, అధికారులను కలిశాను. వాళ్లను కలుసుకోవడం గొప్ప అనుభూతి నిచ్చింది. చిత్రంలో నేను పోషించిన పాత్ర నాకే కొత్తగా అనిపించింది. ఇంతకు ముందెన్నడూ ఆడియన్స్ చూడని కొత్త వాతావరణంలోకి బందోబస్తు చిత్రం తీసుకెళ్తుంది అన్నారు. కార్యక్రమంలో భాగంగా ట్రైలర్ విడుదల చేసిన నిర్మాత డి సురేష్‌బాబు మాట్లాడుతూ -సూర్య వాళ్ల ఫాదర్ నుంచీ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సూర్య సినిమాలన్నీ వైవిథ్యంగా ఉంటాయి. ఈ చిత్రం కూడా మంచి పేరు తేవాలని ఆశిస్తున్నా అన్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ -బందోబస్తు సూర్య కెరీర్‌లో పెద్ద చిత్రంగా నిలుస్తుంది. వంద రోజుల ఫంక్షన్ చేసుకునేంత పెద్ద హిట్టవుతుందని నమ్ముతున్నా. ఈ చిత్రంలో సూర్యకు తెలుగులోనూ పెద్ద మార్కెట్ ఏర్పడాలని ఆశిస్తున్నాను అన్నారు. దర్శకుడు కెవి ఆనంద్ మాట్లాడుతూ -సూర్యతో పని చేయడం గొప్ప ఫీలింగ్. మన అంచనాకు మించి ఆయన నుంచి పెర్ఫార్మెన్స్ దొరుకుతుంది. మోహన్‌లాల్, ఆర్య, సాయేషా.. గొప్ప ఆర్టిస్టులంతా మంచి పాత్రలు చేశారు. టెక్నీషియన్లు తమ పనితనంతో సినిమాను మరో లెవెల్‌కి తీసుకెళ్లడం హ్యాపీగా ఉంది అన్నారు. ఆర్య మాట్లాడుతూ -సూర్యతో పని చేయడమంటే అదో లెర్నింగ్ ప్రాసెస్ అన్నారు. సాయేషా మాట్లాడుతూ -్ఫస్ట్ టైం సూర్య కాంబినేషన్‌గా చేయటం నా కల నెరవేరినంత హ్యాపీగా ఉంది అన్నారు. కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ -బందోబస్తు చిత్రం ఆడియన్స్‌ని పూర్తిగా సంతృప్తిపరుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.