పూర్తయిన దామిని విల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్య ఓం, రేఖా బోజ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తిరుమల సినిమాస్ బ్యానర్‌పై దర్శకుడు రాకేష్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం -దామిని విల్లా. వైవిధ్యమైన హారర్ చిత్రాన్ని దండెం పోలారావు నిర్మించారు. సినిమా షూటింగ్ పార్ట్ పూర్తవ్వడంతో -పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ -నిర్మాత సహకారంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా తెరకెక్కించాం. ఓ నోవెల్ పాయింట్‌తో తెరకెక్కిన చిత్రంలో ఆదిత్య ఓం మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రేఖా భోజ్ అందాలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. అనూహ్య ట్విస్టులతో సాగే కథ -ఆడియన్స్‌కి పూర్తి వినోదం అందిస్తుందన్న నమ్మకం ఉంది. సెప్టెంబర్ 30న ఫస్ట్‌లుక్, టీజర్ విడుదల చేస్తాం. గ్రాఫిక్ ప్రాధాన్యత ఉన్న సినిమా కావడంతో, పోస్ట్ ప్రొడక్షన్స్ పక్కాగా పూర్తి చేసి వచ్చే మార్చిలో సినిమా విడుదల చేయాలని అనుకుంటున్నాం అన్నారు.