మరింత వేగంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంకీర్తన చిత్రంలో నాగార్జునతో జతకట్టి తొలిసారిగా వెండితెరపై మెరిసిన తార రమ్యకృష్ణ, ఆ చిత్రం హిట్టయ్యాక ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ఓవైపు గ్లామర్‌ను పండిస్తూనే మరోవైపు ఉత్తమ నటనకు కూడా మార్కులు వేయించుకుంది. కొంతకాలం గ్యాప్ తరువాత బాహుబలిలో నటించిన శివగామి పాత్రతో రమ్యకృష్ణ కెరీర్ స్పీడందుకుంది. దానికితోడు నాగార్జునతో నటించిన సోగ్గాడే చిన్నినాయన చిత్రం విజయంలో రమ్యకృష్ణ పాత్ర తక్కువని చెప్పలేం. నాగ్ జోడీగా రమ్యకృష్ణ ఆ చిత్రంలో ప్రేక్షకులను అలరించింది. దానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న బంగార్రాజు చిత్రంలో కూడా రమ్యకృష్ణనే ఎంపిక చేశారట. ఇదొక్కటే కాదు, బాలీవుడ్‌లో హిట్ అయిన రైడ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి నాగార్జున రైట్స్ తీసుకున్నారు. ఆ చిత్రంలో కూడా నాగ్‌కు జోడీగా రమ్యకృష్ణనే చేయనున్నదని టాలీవుడ్ సమాచారం. ఓ రకంగా సెకెండ్ ఇన్నింగ్స్ రమ్యకృష్ణకు బాహుబలి, సోగ్గాడే చిన్నినాయన చిత్రాలు పునర్‌వైభవాన్ని తెచ్చాయి. దాంతో ఆమె కెరీర్ మళ్లీ ఫుల్ స్పీడ్‌లో వుంది.