టైం దొరికినట్టే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంగ్ సెనే్సషన్ విజయ్ దేవరకొండతో చేయనున్న చిత్రానికి దర్శకుడు శివ నిర్వాణకు మంచి టైందొరికినట్టే. షూట్‌లోవున్న ప్రాజెక్టు కలిపి మూడు ప్రాజెక్టులు పూరె్తైన తరువాతే -శివ నిర్వాణతో సినిమా చేస్తానన్న విషయాన్ని విజయ్ ఓ ఇంటర్వ్యూలో ఇప్పటికే ప్రకటించాడు. తన ఫ్యూచర్ ప్రాజెక్టులకు సంబంధించి వస్తోన్న కథనాలను ఊహాగానాలుగా కొట్టిపారేస్తూ -చేయబోయే సినిమాలను ప్రకటించాడు. ప్రస్తుతం దర్శకుడు క్రాంతిమాధవతో విజయ్ చేస్తున్న ప్రాజెక్టు -వరల్డ్ ఫేమస్ లవర్. సినిమా చాలావరకూ చిత్రీకరణ పూరె్తైంది. దీని తదుపరి పూరి ప్రాజెక్టుతో విజయ్ సెట్స్‌పైకి వెళ్లనున్నాడు. పూరి సైతం సిద్ధంగా ఉండటంతో -త్వరలోనే బాక్సింగ్ నేపథ్యంగా ‘ఫైటర్’ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ చేసి ఆపేసిన దర్శకుడు ఆనంద్ అన్నామలై ప్రాజెక్టు ‘హీరో’ని -ఆ తరువాత మొదలెడతాడట విజయ్. అంటే ఫైటర్ తరువాత హీరోని పూర్తి చేసి -తరువాత శివ నిర్వాణ ప్రాజెక్టుకు వస్తాడు. నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో దర్శకుడు శివ నిర్వాణ విమర్శకుల ప్రశంసలు అందుకోవడం తెలిసిందే. కథను మెరుగుపర్చుకోడానికి తగినంత టైం దొరకటంతో -స్క్రిప్ట్‌పని పైనే శివ నిర్వాణ ఫోకస్ పెట్టాడట.