అమ్మాయి కావాలంటే.. మనసు గెలవాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిలీప్, శ్రావణి జంటగా దర్శకుడు ఆనంద్ కానుమోలు తెరకెక్కిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ -తొంగి తొంగి చూడకు చందమామ. సురేష్, సాయి, కార్తీక్ అయినాల, రాజ్ బాలా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. గురు రాఘవేంద్ర సమర్పణలో హరివల్లభ ఆట్స బ్యానర్‌పై ఎ సునీతా మోహన్ రెడ్డి సినిమా నిర్మిస్తున్నారు. యువతకునచ్చే అంశాలతో ఆద్యంతం నవ్విస్తూనే మహిళా గొప్పదనాన్ని తెలియజెప్పేలా సినిమా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. సినిమా విడుదలకు సిద్ధమవుతూ -హైదరాబాద్‌లో టీజర్ విడుదల చేశారు. కార్యక్రమంలో దర్శకుడు ఆనంద్ కానుమోలు మాట్లాడుతూ -నిర్మాత మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. కోరుకున్న అమ్మాయిని దక్కించుకోవాలంటే -ముందు ఆ అమ్మాయి మనసు గెలుచుకోవాలని చెప్పే చిత్రమిది. హీరో దిలీప్ మాట్లాడుతూ -దర్శకుడు ఆనంద్ ఈ పాత్రనివ్వడం కొత్త ధైర్యాన్నిచ్చింది. ఇప్పటి యూత్‌కి ప్రతినిధి పాత్రలో కనిపిస్తా అన్నారు. నిర్మాత మోహన్‌రెడ్డి మాట్లాడుతూ -దర్శకుడి ఆలోచనలను నమ్మి సినిమా చేశా. సెన్సార్ పనులు పూర్తిచేసి నవంబర్ చివరివారం లేదా డిసెంబర్‌లో విడుదల చేస్తామన్నారు.