సారీ.. ప్లాన్ చేంజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పడుతూ లేస్తూ సౌత్‌లో సీనియర్‌గా ఇంకా హవా సాగిస్తోంది కాజల్ అగర్వాల్. స్టార్ హీరోలు అందరితో స్క్రీన్ రొమాన్స్ చేసి చూపించిన కాజల్ -నిర్మాతగానూ తన స్టామినా చూపించేందుకు ఆమధ్య గట్టిగానే ప్రయత్నం చేసింది. అందుకు ‘అ’లాంటి వైవిథ్యమైన సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మతో దర్శకుడిగా ఎంచుకున్నట్టు కథనాలు వెలువడ్డాయి. తొలుత ‘అ!’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనుకున్నా, ఆ ఆలోచనను డ్రాప్‌చేసి స్ట్రెయిట్ సినిమాపై దృష్టి పెట్టారట. లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయనున్నట్టు కథనాలు వెలువడినా -దాన్నీ డ్రాప్ చేశారన్నది తాజా సమాచారం. నిర్మాత కావాలన్న ఆలోచననే కాజల్ పక్కన పెట్టేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ సినిమాలన్నీ వరుస ఫ్లాప్‌లు కొడుతుండటంతో -కెరీర్‌పై కాన్‌సన్‌ట్రేట్ చేయమంటూ తండ్రి చెప్పిన మాటను గౌరవించి నిర్మాత కావాలన్న ఆలోచనను పక్కన పెట్టేసిందని అంటున్నారు. ‘డబ్బులు ఊరికే రావు’ అంటూ తండ్రి వినయ్ అగర్వాల్ చేసిన హితబోధతో -కెరీర్‌పైనే మళ్లీ కాజల్ ఫోకస్ పెడుతోందని అంటున్నారు. కాజల్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులున్నాయి. కమల్- శంకర్ కాంబో ‘్భరతీయుడు-2’ ఒకటైతే, బాలీవుడ్‌లో జాన్ అబ్రహంతో ‘మంబై సాగా’కు సైన్ చేసింది కాజల్. సినిమా అటకెక్కడంతో -దర్శకుడు ప్రశాంత్ వర్మ సైతం కొత్త స్క్రిప్ట్‌కు పదును పెట్టుకుంటున్నాడట. అక్కినేని అఖిల్ కోసం ఓ యాక్షన్ థ్రిల్లర్ సిద్ధం చేస్తున్నాడని, దానికి గ్రీన్‌సిగ్నల్ వస్తే సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంటుందని అంటున్నారు.