అంతర్జాతీయం

పఠాన్‌కోట్ దాడిని ఖండించిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 2: పఠాన్‌కోట్‌లోని వైమానిక దళ స్థావరంపై పాక్ సాయుధ టెర్రరిస్టులు శనివారం జరిపిన ఉగ్రవాద దాడిని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించడమే కాకుండా రెండు దేశాల మధ్య ఇటీవలి ఉన్నతస్థాయి భేటీల సందర్భంగా నెలకొన్న సుహృద్భావాన్ని మరింతగా పెంపొందించుకోవడానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. అంతేకాకుండా భారత్‌తో కలిసి ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి కూడా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ‘ఉగ్రవాద దాడిని పాక్ ఖండిస్తోంది. భారత ప్రభుత్వానికి, ప్రజలకు, మృతుల కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం’ అని పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రెండు దేశాల మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల సందర్భంగా నెలకొన్న సుహృద్భావాన్ని పెంపొందించుకోవడానికి, ఈ ప్రాంతాన్ని దెబ్బతీస్తున్న ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించడానికి భారత్‌తో పాటుగా ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో చేతులు కలిపి పని చేయడానికి పాక్ ఇప్పటికీ కట్టుబడి ఉందని ప్రకటన తెలిపింది.