అమ్మాయిలంతే... అదో టైపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపిరంగా, మాళవిక మీనన్, శివాజీరాజా ప్రధాన పాత్రధారులుగా గాయత్రి రీల్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అమ్మాయిలంతే.. అదో టైపు’. కృష్ణం దర్శకత్వంలో వై.వి.ఎస్.ఎస్. ఆర్.కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వై.వి.ఎస్.ఎస్.ఆర్.కృష్ణంరాజు మాట్లాడుతూ ‘అమ్మాయిలంతే.. అదో టైపు’ మంచి ప్రేమకథా చిత్రమని, ఒక ఊరిలో బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి, ఒక ఆటోడ్రైవర్‌ని ప్రేమించి, తన తండ్రి గౌరవం కంటే తన ప్రేమే ముఖ్యమనుకొని తండ్రికి తెలియకుండా అతడిని తీసుకొని హైదరాబాద్‌కి వెడుతుందని, అది తెలుసుకొని కుంగిపోయిన తండ్రి, తన కూతురుకోసం పడ్డ తపన, తన తీసుకున్న తొందరపాటు నిర్ణయంవల్ల, తండ్రి ప్రేమకి దూరమయ్యాననే కూతురు పడే బాధ, ఆ తరువాత జరిగే పర్యవసానాల మధ్య సాగే ఎమోషనల్ కథ ఇదని అన్నారు. దర్శకుడు కృష్ణమ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, జనవరిలో ఆడియో విడుదలచేసి, త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్, సాహిత్యం: పూర్ణాచారి, నిర్మాత: వై.వి.ఎస్.ఎస్.ఆర్.కృష్ణంరాజు, దర్శకత్వం: కృష్ణమ్.