భక్తి కథలు

లేదు మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు చెడ్డవాళ్లనో, దుర్మార్గులనో కుమిలిపోవలసిన అవసరం లేదు. మనలో పాపం చెయ్యని వారు ఎవరో చెప్పండి అని అడిగారు యేసుక్రీస్తు. ఈ భూమిపైన పరమ పవిత్రులు బహుశా ఎవ్వరూ లేరు. అందువల్ల మీరు పాపం చేశారని కుమిలిపోకండి. ఈ రోజు నుండే ఈ క్షణం నుండే మీరు మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. సరికొత్త జీవనం ప్రారంభించండి అని వ్రాశారు ‘లోబ్‌సాంగ్ రాంపా’ అనే టిబెట్ మాస్టర్.
మనుషుల్లో మాలిన్యం ఉన్నట్లే, ఈ భూమి మీద కూడా చాలా మాలిన్యం ఉంది. అయినా అది ఎప్పటికప్పుడు కొట్టుకుపోతూనే నశించిపోతూనే ఉంటుంది. నిర్మలం, అవినీతికి లొంగని ధీరత్వం మనుషుల్లో ఎప్పుడైతే స్థిరపడడం మొదలవుతాయో, అపుడు లోపలి మాలిన్యం కొట్టుకుపోవడం మొదలుపెడుతుంది. అందువల్ల ఈ జన్మలోనే, ఈ రోజే ఈ క్షణమే మీతో మీరు ఉండడానికి ప్రయత్నం మొదలుపెట్టండి. మీ జన్మ పరంపరల యొక్క అనుభవాలు మీకు అవగతం కావడం మొదలవుతుంది. ఎందుకొచ్చారో, ఎలా వచ్చారో మీకే తెలుస్తుంది. ఒక అరగంట కళ్లు మూసుకుని ‘శ్వాస మీద ధ్యాస’ పెట్టండి అని బోధించారు బ్రహ్మర్షి ప్రతీజీ.
చుట్టుపక్కల అందరి మరణాలు చూస్తూ ఉన్నా.. నేను మాత్రం చావను అనుకుంటాడు మనిషి - అని యక్షుని ప్రశ్నకు జవాబిస్తాడు ధర్మరాజు. కానీ మరణం తథ్యం శరీరానికి అని ఆలస్యంగానైనా తెలుసుకుంటారు మనుషులు.
మనం రోజూ చూస్తూనే ఉంటాం గర్భస్థ శిశువుల యొక్క, రోజుల పసిగుడ్డుగా, బాల్యంలోనే మరణిస్తున్న వారిని. అలాగే నిండు యవ్వనంలో అకాల మృత్యువాత పడుతున్న వారిని! మాట్లాడుతూ మాట్లాడుతూనే మన ఎదురుగానే కుప్పకూలి మరణించే వారిని! ఇన్ని చూస్తున్నా మనం మాత్రం కలకాల జీవిస్తాం అని అనుకుంటూ ఉంటాం. కానీ శ్వాసలు పూర్తయితేనే వెళ్లిపోతాం.
ఆత్మ శాశ్వతమైంది - దానికి మరణం లేదు అని ఎంతమంది మహాఋషులు ఎన్నో యుగాల నుండి బోధిస్తున్నారు. ఆత్మే పరబ్రహ్మం - ద్రష్ట, దర్శనం, దృశ్యం - ఈ త్రిపుటిల్లో గోచరించేది నీ ఆత్మస్వరూపమే అని వచించారు వశిష్ఠ మహర్షి యోగవాశిష్ఠంలో! మనుషులు పుడుతున్నారు, మరణిస్తున్నారు. జన్మల పరంపర ఉంది. కర్మ పరంపర ఉంది అని వేదాలు, శాస్త్రాలు బోధిస్తున్నా, భౌతిక శాస్తజ్ఞ్రులు దీన్ని ధృవీకరించడం లేదు.
సైన్సుకు తార్కాణం (ఋజువులు) కావాలి. అయితే ఆత్మవిద్యకు ఆంతరాత్మే సాక్షి. మరి పునర్జన్మలు లేవు అనుకుంటే మనం మరణించి ఎక్కడికి వెడుతున్నాం? జన్మలు ఎలా జరుగుతున్నాయి? శరీరంలో జీవశక్తి ఎలా వస్తోంది? మరణించిన మనిషిలో జీవశక్తి (ఉనికి) ఎక్కడికి వెళ్లింది? ఈ ప్రశ్నలకు సైంటిస్టులు ఏమీ సమాధానం చెప్పరు.
శక్తి అనంతం. శక్తి బహురూపాలు. అనంత రూపాలు. మనుగడనిచ్చే శక్తి భూమి. ప్రాణాలను నిలిపే శక్తి, శుద్ధిచేసే శక్తి జలం. చైత్య చైతన్య శక్తి అగ్ని. ప్రాణశక్తి, చలనశక్తి వాయువు. శబ్దం, వాక్కు, ఉనికి ఆకాశం. వీటినే మనం పంచమహాభూతాలు అంటాం. ఆ పంచభూతాలు మానవ శరీరంలోనూ ఉన్నాయి. ధ్యానంలో గమనిస్తే - అన్నీ అంతా మనమే అని, మనం దివి నుండి భువికి జన్మ తీసుకుని వచ్చిన ‘అంశాత్మలం’ అనీ, ప్రతి మనిషిలోనూ ఉండేది అదేనని, దానికి మరణమే లేదు అని అర్థమవుతుంది.

-మారం శివప్రసాద్