డైలీ సీరియల్

యాజ్ఞసేని..42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంపిల్యం దుఃఖసాగరంలో మునిగింది. పురవీధులలో రెండుప్రక్కలా నిలిచిన ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. కొందరు జయజయ ద్వానాలు చేశారు.
పాండవుల రథాలు ముందు నడువగా వెనుక ద్రౌపది రథం దానిని అనుసరిస్తున్నది. వీరికి ముందు వెనుకలా భటులు శస్తధ్రారులై నడుస్తున్నారు. అశ్వికులు, గజారోహులు వారిని అనుసరిస్తూ నడుస్తున్నాయి. రథాలన్నీ కాంపిల్య నగర ప్రాకారాలన్నిటినీ దాటాయి.
ద్రుపద మహారాజు వారి వెంట కోటదాటేవరకు వచ్చాడు. ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులకు ప్రేమగా వీడ్కోలు చెప్పి సాగనంపాడు.
ద్రౌపది రథం సాగుతున్నది. ద్రౌపదితోపాటు ఆమె ప్రియసఖి ధాత్రేయిక కూడా వున్నది. ఇంతలో ఒక్కసారి ఉద్యానవనం నుండి వచ్చిన చిలుక ద్రౌపది భుజంమీద వ్రాలింది. అందరూ ఒక్కసారి ఆశ్చర్య చకితులైనారు.
వేగులవారు విదురునితో పాటు పాండవుల రాకను హస్తినాపురంలోని దృతరాష్ట్ర మహారాజుకు తెలియపరచారు.

23
హస్తినాపురము
ఇది కురు సామ్రాజ్యానికి ముఖ్య పట్టణం.
భారతదేశానికి ఉత్తర దిక్కున వున్న హిమాలయ పర్వత శ్రేణులకు అతి దగ్గరలోనున్నది. హిమాలయాలలో పుట్టిన పవిత్రమైన యమునా నది (జమున /కాలింది) ఈ హస్తినకు ప్రక్కగా ప్రవహిస్తుండగా, తూర్పు దిక్కునకు అతి సమీపంలో గంగానది ప్రవహిస్తున్నది.
ఈ హస్తినకు (కురు సామ్రాజ్యానికి) క్రింది భాగంలో దక్షిణ దిక్కుకు పాంచాల, మచ్చిల్లక, (మల్ల) వజ్జి, అంగద జనపదాలు వున్నాయి. తూర్పు దక్షిణ దిక్కుగా ప్రసిద్ధి చెందిన మగధ జన పదం కలదు.
పశ్చిమ దక్షిణ దిక్కున క్రింది భాగంలో శూరసేన, మత్స్య, వత్స, (కౌసంబి/సుక్తిమతి) అవంతి (ఉజ్జయిని) చేది దేశాలు కలవు.
అట్లే కురుజామ్రాజ్యానికి ఉత్తర వాయవ్యంగా సింధు వాహక రాజ్యాలు, ఆ పైభాగాన గాంధార (ప్రసిద్ధి చెందిన పుష్కలవత, తక్షశిల విశ్వవిద్యాకేంద్రాలు), కాంభోజ, త్రిగర్త, మద్ర, కేకయ రాజ్యాలు కలవు. (ఇవి సింధూవాహక రాజ్యాలుగా పిలువబడ్డాయి).
కురు సామ్రాజ్యానికి చుట్టూ పదునైదు జనపదాలు గలవు (ఇవి పూర్వభారతదేశ జనపదాలు).
చంద్రవంశపు రాజైన భరతునికి ముదిమనుమడైన ‘సుహోత్రుని’కి భార్య ‘సువర్ణ’ యందు జన్మించినవాడు ‘హస్తి’ అనువాడు.
ఈ ‘హస్తి’ అనే పేరుమీదనే హస్తినాపురంగా ప్రసిద్ధి చెందింది.
పాండవుల రాకను పురస్కరించుకొని ధృతరాష్ట్రుడు వక్రబుద్ధి కలవాడైనప్పటికినీ పురాన్ని శోభాయమానంగా అలంకరించమని ఆజ్ఞాపించాడు.
పురవీధులన్నింటినీ నీటితో తడిపారు. పౌరులు అన్ని వైపులా రంగవల్లులతో అలకరించారు.
స్వాగత తోరణాలు కట్టబడ్డాయి.
దివ్యధూపాలు వెలిగించారు. పుష్పమాలలతో, జెండాలతో పురవీధులన్నీ ప్రకాశిస్తున్నాయి.
శంఖ భేరీ నాదాలతో, మంగళవాద్యాలతో మారుమ్రోగుతూ నగరం కుతూహలంతో దేదీప్యమానంగా వెలుగొందింది.
పాండవులు పురప్రవేశం చేస్తున్నారని తెలిసికొన్న దృతరాష్ట్రుడు వారికి స్వాగతం చెప్పటానికి కౌరవులను పంపాడు.
ధానుష్కులైన వికర్ణుడినీ, చిత్రసేనుడినీ పంపాడు.్ధనుర్విద్యా విశారదులైన ద్రోణాచార్యుడినీ, కృపాచార్యుడినీ పంపాడు.
వీరందరూ స్వాగతం పలుకగా పాండవులు శ్రీకృష్ణుడు, విదురుడు వెంట రాగా పురప్రవేశం చేశారు.
పాండవులు పురుష శ్రేష్ఠులు. ప్రజల సుఖ దుఃఖాలను విచారించేవారు. ప్రియంజేసేవారు అని ప్రజలు పలుకగా పాండవులు విన్నారు.

- ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము