డైలీ సీరియల్

శ్రీకృష్ణ రమ్య రామాయణం (రెండవ భాగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశదిశల బంగారు కాంతులీనంగ

మబ్బుల్లుమురిసేనో
గాలి ముదమందెనో
పంచభూతాలన్నీ
పరవశించేనో
అనినట్లు సన సన్న జల్లులే కురిసె

మేనులే పులకింప
హరివిల్లు విరిసె
ఏడురంగులతోడ
వేడుకను చేసె

ఏ రక్కసికి కన్నుకుట్టెనో యనగ
ఏ చీకటికి ఈర్ష్య కలిగెనో యనగ
ఏ గ్రహము ఆగ్రహము చూపెనోయనగ
ఉండుండి గగనాన మ ఊగె మబ్బుళఉల
మెరుపులెన్నో మెరిసి కురిసె పిడుగుళ్ళు

చెదిరిపోయెను గుంపు
బెదరె గజతురగముల్
నలుదిక్కులకు నేగె
పరివారమంత
ఇంతలో కొండపై
మెరపు మెరిసింది
మెరపు తోడు తనొక్క
ఉరుము ఉరిమింది
మెరపు ఉరుముల నడుమ
పర్వతం లోలె

ఒక మహాకాయమ్ము కనుల కట్టింది
ఊక చేత పరశువు
ఒక చేత ధనువు
నొసట పౌండ్రమ్ముతో
మెరిసె నారూపు
కొండపైనను కొండ
నిలిచెనో యనగ
సూర్యున్ని చందురుడె
అడ్డుకొనే ననగ
పరశువున నాతండు అడ్డగించేడు

‘‘ఎవరోయి ఇతగాడు
ఇట్టి మొనగాడు?
అపరరుద్రుని భాతి
అగుపించువాడు?

ఎవరు ఈతని తండ్రి?
ఎవరోయి తల్లి?
ఉడుమువలె, పిడుగువలె
ఊడిపడినాడు?
రాజాధిరాజునే ఎదురుకొనినాడు?’’’

‘‘ఎదురుకోళ్ళయిపోయె
ఊరేగుటాయె
అప్పగింతలవేడ్క
అపుడే ముగిసె
తరలిపోయెడు వేళ ఎదుర్కోళ్ళేల?’’

అంచు అతివలంత
విసువు చెందేరు
ద్రష్టలైనవారు
దృష్టి సారించారు
‘‘అవతారపురుషుండు!
భార్గవుండం’’చు!

ఇంకా ఉంది

- గన్ను కృష్ణమూర్తి, 9247227087