డైలీ సీరియల్
శ్రీకృష్ణ రమ్య రామాయణం (రెండవ భాగం)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అక్షతలు నంత
పట్టపగలే మొలిచెనో చుక్కలనగ
అందరూ బెదిరేరు
చెదరిపోయేరు
కనులనూ, చెవులనూ
మసికొన్నారు
వచనం:
‘‘అమంగళం అప్రతిహతవౌగాక!’’ అన్నారప్పులడు బ్రాహ్మలు శుభాన్ని కాంక్షిస్తూ.
‘‘ఎందుకాగ్రహమ్ము?
ఏమిటీ తీరు?
పసిపిల్లవాండ్రపై
కసిబూనుటేల?’’
అనుచు చేతులు జోడ్చినాడు దశరథుడు
‘‘ఆగ్రహముకాక నా
కానందమేది?
ఎక్కడా రాముండు?
ఎక్కడున్నాడు?
హరధనువు ఖండించి
చేసెనపరాధం’’
‘‘శాంతించు నాయనా!
శాంతించు తండ్రీ!
చూపుమనుగ్రహమ్ము
కాదు ఆగ్రహము’’
అనెనిట్లు శిష్టుడా వశిష్టుండునంత
‘‘అది ఏమి గురుదేవ!
మీరు ఆ మాటే!
నా దైవమైనట్టి
శివుని విల్లంబు
విరిచినాడట యొకడు శాంతింతునెటుల?’’
అనుచు దండము వెట్టె
రేణుకాసుతుడు
‘‘శివుడు దైవమ్మనుమాట
నిక్కమే సుమీ
మీకె దైవము కాదు
మాకు దైవమ్మే’’
అనుచు శాంతింపగ చూచె దశరథుడు
‘‘ఐనచో విల్లంబు
నేల విరిచేను?
విరిచి దానిని నేల
పాలేల జేసె?
పూజింపవలె దాని ఖండింపతగునో?’’
‘‘శివధనువు నెవ్వాడు
ఎక్కుపెట్టెనో
వానికే తనకూతు
నిత్తుననియంచు
జనకుండు నిర్ణయము ప్రకటించినాడు
అందుకే రాముండు
ఎక్కుపెట్టేను
ఎక్కుపెట్టెనో లేదో
ముక్కలైపోయె’’
అంచు వివరించెను మునివర్యుడంత
‘‘రాముడుంగ వేరె
రాముడెవ్వాడు?
అంతవాడా వాడు?
ఎదురుపడడేమి?
పిల్లివోలెను బెదరి
దాగికొనుటేమి?’’
అనుచు నిప్పుల చెరగినాడు భార్గవుడు
ఇంకా ఉంది