డైలీ సీరియల్

యాజ్ఞసేని 54

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజాజ్ఞ ప్రకారం రాజులందరినీ ఆహ్వానించటానికి సహదేవుడు వెంటనే దూతలను పంపాడు.
దేశ దేశాలనుండి బ్రాహ్మణులందరూ వచ్చారు. వారందరూ కలసి సరైన సమయంలో ధర్మరాజుకు దీక్షను ఇచ్చారు. వేలకొలది బ్రహ్మణులు వెంటరాగా నలుగురు సోదరులతో, జ్ఞాతులతో, మంత్రులతో, నానా దేశాలనుండి వచ్చిన రాజులతో నరశ్రేష్ఠుడైన ధర్మరాజు యజ్ఞశాలలో ప్రవేశించాడు.
ధర్మరాజును, అతని సభాభవనాన్ని చూడటానికి అన్ని దిక్కులనుండి క్షత్రియ రాజులు వచ్చారు. వారందరూ వారి వెంట రకరకాల విలువైన కానుకలను తీసికొని వచ్చారు.
ఆహ్వానాన్ని అందుకున్న ధృతరాష్ట్రుడు, భీష్మ పితామహడు, బుద్ధిమంతుడైన విదురుడు, దుర్యోధనుడు, అతడి సోదరులు, గాంధార రాజైన సుబలుడు, సుబలుని పుత్రులైన శకుని, అచలుడు, వృషకుడు, మహారతి కర్ణుడు, పాండవుల మేనమామ శల్యుడు, బాహ్లికుడు (శంతనుని సోదరుడు) సోమదత్తుడు (బాహ్లికుని కొడుకు), సోమదత్తుని పుత్రులైన భూరి, భూరిశ్రవుడు, శలుపడు, పాండవుల అస్త్ర గురువన ‘ద్రోణాచార్యుడు’, అతడి కుమారుడు ‘అశ్వత్థామ’, పాండవుల ప్రథమ అస్త్ర గురువు కృపాచార్యుడు ప్రేమతో వచ్చారు.
ధృతరాష్ట్ర భీష్మ ద్రోణాదులకు ఎదురుగా వచ్చి యుధిష్ఠిరుడు వారి పాదాలకు నమస్కరించాడు.
కృపాచార్య, దుర్యోధనాదులతో ఈ యజ్ఞంలో మీరందరూ నన్ను అన్ని విధాలా అనుగ్రహించండి’ అని అన్నారు.
కౌరవ పాండవుల చెల్లెలైన దుశ్శల (దుస్సల), ఆమెభర్త సింధురాజైన ‘జయద్రథుడు’ (సైంధవుడు)వచ్చారు.
పాండవుల మామ, యాజ్ఞసని (ద్రౌపది) తండ్రి అయిన ‘ద్రుపదమహారాజు’ పుత్రుడైన దుష్టద్యుమ్నునితో కలిసి సైన్య సమేతుడై వచ్చాడు.
ప్రాగ్జ్యోతిషపురాన నరేషుడు భగదత్తుడు, శాల్వుడు, సముద్ర తీర వాసులు, మ్లేచ్ఛజాతులు, పర్వతరాజులు, కానుకలతో వచ్చారు.
బృహద్భలుడు, పుండ్రపతి పౌండ్రక వాసుదేవుడు, వంగరాజు, కళింగ నృపతి, ఆకర్షణుడు, కుంతల, మాలవ, ఆంధ్ర, ద్రావిడ, సింహళ దేశపు రాజులు, కాశ్మీర రాజు, మహాతేజస్వి అయిన ‘కుంతిభోజుడు, గౌరవాహనుడు, మత్స్యదేశాధిపతి అయిన విరాటుడు తన యిద్దరి కుమారులతో మహాబలుడు మావేల్లుడు, నానాజనపద శాసక రాజులు తమ తమ సైన్యంతో వచ్చారు.
యుద్ధగర్వితుడు, ఒకప్పటి జరాసంధుని సర్వసైన్యాధిపతి చేది దేశ భూపతి అయిన శిశుపాలుడు తన పుత్రులతో కలిసి వచ్చాడు.
యదువృష్ణి కుకుర భోజాంధక వంశజులైన బలరాముడు, అనిరుద్ధుడు, కంకుడు, సారణుడు, గదుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, చారుదేష్ణుడు, ఉల్యుకుడు, శిశిరుడు, అంగావహుడు మొదలైన వారందరూ తమ తమ బంధు, మిత్రులతో యజ్ఞ దర్శనానికి ఏతెంచారు.
వచ్చిన రాజులందరికినీ విశ్రాతికై వారి వారి అర్హతకు తగినట్లుగా ఉత్తమ భవనాలను, తినటానికి భక్ష్యభోజనాలను సమకూర్చడమైనది.
ఆ సమయంలో రాజులు, బ్రాహ్మణులు, మహర్షులతో నిండిన ఆ యజ్ఞమండపం దేవతలో నిండిన బ్రహ్మలోకంతో సమానంగా శోభిల్లింది.
యజ్ఞదీక్షితుడైన ధర్మరాజు వచ్చిన వారికి అర్హమైన అధికారాలను అప్పగించాడు.
భక్ష్యభోజ్యాలను చూచి వాటిని సరిగా పంచటానికై దుశ్శాసనుని నియమించాడు.
బ్రాహ్మణుల స్వాగత సత్కార బాధ్యతలను ‘అశ్వత్థామ’కు అప్పగించాడు. రాజన్యుల సత్కారానికి దృతరాష్ట్ర మహారాజు మంత్రి అయిన సంజయుని నియమించాడు.
‘ఈ పని చేయి, ఈ పని చేయవద్దు’ అనే శాసనాధికారాన్ని పూజ్యులైన భీష్మపితామహుని, ద్రోణాచార్యుడి భుజస్కంధాలపై ఉంచాడు ధర్మరాజు.
ఉత్తమ బంగారాన్ని, రత్నాలను రక్షించటం, దానం చేయటం అనే పనుల భారాన్ని కృపాచార్యునిపై పెట్టాడు.
నకులునిచే ఆహ్వానింపబడిన బాహ్లిక, సోమదత్త, ధృతరాష్ట్ర మహారాజుకు, జయద్రథులకు ఇంటి యజమానులవలె యుండే అధికారాన్ని ఇచ్చాడు.
కానుకలను స్వీకరించటం, వాటిని ఉచిత ప్రదేశాలకు తరలించటం అనే కార్యాలను దుర్యోధనునికి అప్పగించాడు.

- ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము