రవితేజ సరసన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న అమర్ అక్బర్ అంటోని చిత్రం లేటెస్ట్‌గా మొదలైన విషయం తెలిసిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అమెరికాలో జరగనుంది. అయితే ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని తెలిసింది. అందులో ఇప్పటికే ఓ హీరోయిన్‌గా అను ఇమ్మానుయేల్‌ని ఎంపిక చేసారు. ఇక మరో హీరోయిన్‌గా కాజల్‌ని అడిగారని తెలిసింది. అయితే కాజల్ నో చెప్పడంతో మరో హీరోయిన్‌ను తీసుకోవాలని శ్రీనువైట్ల ట్రై చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో నివేద థామస్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలని ప్లాన్ చేశారట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నారట. నాని నటించిన జెంటిల్‌మెన్ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న నివేద థామస్ నటిగా ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఇందులో కూడా ఆమె నటనకు స్కోప్ ఉన్న పాత్రలోనే కనిపిస్తుందని టాక్. అమర్ అక్బర్ ఆంటోని పేరుతో తెరకెక్కే ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఉంటుందని టాక్.